Advertisement

Advertisement


Home > Politics - National

కలియుగ శబరి.. 30 ఏళ్లుగా మౌనవ్రతం

కలియుగ శబరి.. 30 ఏళ్లుగా మౌనవ్రతం

శబరి గురించి మనందరికీ తెలుసు. రాముడి కోసం ఆమె ఎంత పరితపించిందో రామాయణంలో చదువుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి మరో శబరి గురించి. ఈమె కూడా రాముడి కోసం పరితపించింది. ఆమె కోరిక నెరవేరింది.

ఈమె పేరు సరస్వతీ దేవి. వయసు 85 సంవత్సరాలు. జార్ఘండ్ కు చెందిన ఈమె శ్రీరాముడి భక్తురాలు. రాముడంటే ఆమెకు ఎంత భక్తి అంటే, అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం జరిగే వరకు మౌనవ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు.

అలా 1992లో ప్రతిజ్ఞ చేసిన ఆమె, అప్పట్నుంచి రోజుకు 23 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ప్రధాని మోదీ, ఆలయానికి శంకుస్థాపన చేశారు, ఆ రోజు నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల పాటు మౌనవ్రతం పాటించారు.

ఎట్టకేలకు ఆమె వ్రతం ఫలించింది. రామాలయ నిర్మాణం పూర్తయింది. 22వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది. రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను టీవీల్లో వీక్షించిన తర్వాత ఆమె తన మౌనవ్రతం వీడనున్నారు.

704 కిలోమీటర్లు స్కేటింగ్... రాముడిపై తన భక్తిని రాజస్థాన్ కు చెందిన ఓ కుర్రాడు వినూత్నంగా చాటుకున్నాడు. విగ్రహ ప్రతిష్టను చూసేందుకు స్కేటింగ్ చేస్తూ అయోధ్యకు వస్తానని మొక్కుకున్నాడు. రాజస్థాన్ లోని కోట్ పుట్లీ నుంచి అయోధ్యకు 704 కిలోమీటర్లు. ఈ మొత్తం దూరాన్ని స్కేటింగ్ ద్వారా పూర్తి చేయబోతున్నాడు రామ్ లల్లా అనే ఈ కుర్రాడు. ఆల్రెడీ తన స్కేటింగ్ యాత్ర మొదలుపెట్టాడు. ఆలయ ప్రారంభోత్సవం నాటికి అక్కడికి చేరుకుంటానంటున్నాడు.

ఆ 3 రోజులు అనుమతి లేదు.. ఇక రామమందిర ప్రాణప్రతిష్ట కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కనివినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం 20, 21, 22 తేదీల్లో ఆలయ సందర్శనను నిషేధించారు. సామాన్యులెవ్వరికీ ఈ 3 రోజుల్లో ఆలయ దర్శనం ఉండదు. ఆహ్వానం ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి. 23వ తేదీ నుంచి సామాన్యులకు కూడా దర్శనభాగ్యం ఉంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?