అత్తను, భర్తను హింసాత్మకంగా కోల్పోయిన సోనియా… తల్లిని కూడా కోల్పోతామేమోనన్న పిల్లల భయం… ఆత్మకథలో వెలుగుచూసిన భావోద్వేగ సంఘటన
దేశానికి ప్రధానమంత్రి కావడం రాజకీయ జీవితంలో అత్యున్నత అవకాశాల్లో ఒకటి. కానీ అదే పదవిని చేపట్టవద్దని సొంత పిల్లలే తమ తల్లిని కోరితే? దేశాన్ని నడిపించే అవకాశం ఒకవైపు, తల్లిని కూడా కోల్పోతామేమోనన్న పిల్లల భయం మరోవైపు ఉంటే? 2004లో సోనియా గాంధీ ఎదుర్కొన్న పరిస్థితి ఇదే.
తాజాగా విడుదలైన ఆమె ఆత్మకథ Belonging: A Journey of Love ఈ సంఘటనలోని మానవీయ కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఇటలీలో జన్మించిన సోనియా, రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని భారతదేశానికి వచ్చారు. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకురాళ్లలో ఒకరైన ఇందిరా గాంధీకి కోడలయ్యారు. కానీ ఆ కుటుంబంలో ఆమె జీవితం రెండు విషాదాలను ఎదుర్కొంది.
1984లో ఇందిరా గాంధీ హత్యకు గురికాగా, 1991లో రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఏడేళ్ల వ్యవధిలో ఒకే కుటుంబం ఇద్దరు ప్రధానమంత్రులను కోల్పోయింది. దేశానికి వారు గొప్ప రాజకీయ నాయకులు కావచ్చు. కానీ రాహుల్, ప్రియాంకలకు ఒకరు నానమ్మ, మరొకరు తండ్రి.
రాజీవ్ గాంధీ హత్యకు ముందే ఆయన భద్రతపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సోనియా తన ఆత్మకథలో గుర్తుచేశారు. తండ్రి మరణం తరువాత ఆ కుటుంబం ఎదుర్కొన్న వేదన పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది.
2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభించింది. సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలని పార్టీ నాయకులు, మిత్రపక్షాలు కోరారు.
అయితే ఈ ప్రతిపాదన రాహుల్, ప్రియాంకలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే నానమ్మను, తండ్రిని హత్యల్లో కోల్పోయిన వారు, తల్లి కూడా అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడ్డారు.
ప్రధానమంత్రి పదవిని స్వీకరించవద్దని పిల్లలు కోరినట్లు సోనియా వెల్లడించారు. ఒకవైపు పార్టీ పట్ల బాధ్యత, మరోవైపు తన వ్యక్తిగత నిర్ణయం, కుటుంబ ఆందోళనలు ఆమెను అంతర్మథనానికి గురిచేశాయి. చివరకు ప్రధానమంత్రి పదవిని తిరస్కరించి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు.
అప్పట్లో సోనియా విదేశీ జన్మస్థలం, ప్రధానమంత్రి పదవిని తిరస్కరించిన కారణాలపై అనేక రాజకీయ చర్చలు జరిగాయి. ఆ నిర్ణయాన్ని కొందరు సమర్థించగా, మరికొందరు విమర్శించారు.
అయితే ఆమె ఆత్మకథలో వెల్లడించిన కుటుంబ సంభాషణలు ఆ సంఘటనలో మరో కోణాన్ని తెలియజేస్తున్నాయి. పిల్లల భయమే ఆమె నిర్ణయానికి ఏకైక కారణమని చెప్పలేకపోయినా, ఆ భయం కుటుంబంపై చూపిన ప్రభావం ఆమె వర్ణనలో స్పష్టంగా కనిపిస్తుంది.
రాజకీయ నాయకుల నిర్ణయాలను వారి పదవులు, పార్టీలు, సిద్ధాంతాల ఆధారంగా విశ్లేషించడం సహజం. కానీ వారి కుటుంబాలకు కూడా వ్యక్తిగత భయాలు, బాధలు ఉంటాయి.
దేశ రాజకీయాల్లో అత్యున్నత పదవి గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలు ఆలోచించింది అధికారం గురించి కాదు… తమ తల్లి భద్రత గురించి.
రాజకీయంగా సోనియా గాంధీ నిర్ణయంపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ నానమ్మను, తండ్రిని హింసాత్మకంగా కోల్పోయిన పిల్లలు తమ తల్లిని కూడా కోల్పోతామేమోనని భయపడటం వెనుక ఉన్న వేదనను రాజకీయాలకు అతీతంగా అర్థం చేసుకోవాలి. దేశానికి ఒక ప్రధానమంత్రి అవసరం కావచ్చు… కానీ ఆ ఇద్దరు పిల్లలకు తమ తల్లి కావాలి.
– వంశీ కృష్ణ ఇరువారం

cha…prathee kukka oka aatma katha raaseste…dhaaniki malli reviews ivvatam okati…ee dikkumalina sonia khan gandhi oka anti national…dheeni gurinchi alochinchatam ante adhi oka desadroham tho samanam.
పంధొమ్మిది వందల తొంబై తొమ్మిది లో ప్రధానమంత్రి పదవికి ఎగబడింది. మద్దత్తు కూడగట్టలేక చతికిల పడింది
రెండు వేల నాలుగు లో ప్రదానమంత్రి పదవికి ఎగబడింది. విదేశస్తురాలికి పదవి అప్పగించటానికి సుబ్రమణ్యంస్వామి అడ్డం పడ్డాడు
దొడ్డిదోవన బాధ్యతలేని డమ్మీ ప్రధానమంత్రిని అడ్డం పెట్టుకుని ప్రధాని పైన సూపర్ ప్రధానిగా అధికారం చలాయించింది. అందినంత దోచుకున్నది.
ఇప్పుడు శ్రీరంగనీతులు చెప్పుతున్నది
చరిత్ర మాకూ తెలుసు
పంధొమ్మిది వందల తొంబై తొమ్మిది లో ప్రధానమంత్రి పదవికి ఎగబడింది. మద్దత్తు కూడగట్టలేక చతికిల పడింది
రెండు వేల నాలుగు లో ప్రదానమంత్రి పదవికి ఎగబడింది. విదేశస్తురాలికి పదవి అప్పగించటానికి సుబ్రమణ్యంస్వామి అడ్డం పడ్డాడు
దొడ్డిదోవన డమ్మీ ప్రధానమంత్రిని అడ్డం పెట్టుకుని ప్రధాని పైన సూపర్ ప్రధానిగా బాధ్యతలేని అధికారం చలాయించింది. అందినంత దోచుకున్నది.
స్కాముల్లో లక్షల కోట్లు సంపాదించుకున్నది. అల్లుడిని వేల కోట్ల కోటీశ్వరుడిని చేసింది. పనికిమాలిన కొడుకుని ఇప్పుడు ప్రధానమంత్రిని చేయాలని ఆరాటపడుతున్నది
ఇప్పుడు శ్రీరంగనీతులు చెప్పుతున్నది
పావలా పరకకు ఆర్టికిల్స్ రాసే సొల్లుగొట్టాం గాళ్ళు చేప్పే కధల వెనుక చరిత్ర మాకూ తెలుసు
She and Congress Party don’t have any hope for 2029 elections also. So she is now trying to pacify the blunders like Sikh Massacre, Emergency etc and playing victim card.. As of today also, even if she has majority, she cannot become PM..
She and Congress Party don’t have any hope for ****2029***elections**** also. So she is now trying to pacify the ****blunders**** like Sikh Massacre, Emergency etc and playing ****victim****card.. As of today also, even if she has majority, she cannot become PM..
ilaagaite maa Anna vastaadu victim card toh.. talli chelli torture pedutunnaru..tadrini Babai ni pogottukunna..CM & opposition leader padavi kooda pogottukunna..muchhata kattinchina Vizag Palace, dochesina dabbulu ED seize chesindi..olammo olayya ani