Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ నేత తప్పు ఒప్పుకున్నాడు సరే.. శిక్ష సంగతేంటి?

టీడీపీ నేత తప్పు ఒప్పుకున్నాడు సరే.. శిక్ష సంగతేంటి?

వినోద్ జైన్ వేధింపులతో విజయవాడ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆయన ఒక టీడీపీ నేత, ఆ టీడీపీ నేత తప్పు ఒప్పుకున్నాడు, వేధించానని పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. ఇంతవరకు బాగానే ఉంది. అధికార పార్టీ.. టీడీపీని సక్సెస్ ఫుల్ గా ఇరుకునపెట్టగలిగింది. మరి సోషల్ మీడియా ట్రోలింగ్ ల సంగతేంటి. 

మీరు తెచ్చిన దిశ చట్టం ప్రకారం, మీరు చెప్పిన న్యాయం జరుగుతుందా. ఏమాత్రం జాప్యం జరగకుండా ఉరిశిక్ష వేయించగలరా..? అది జరిగితే.. నిజంగా ఏపీలో మరో నీఛుడు అలాంటిపని చేయడు.

వైసీపీ నిరసనలతో ఏం చెబుతున్నట్టు..?

ఏపీలో ఓ బాలికను ఓ నీఛుడు చెరబట్టాలని చూశాడు, అవమానం భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం టీడీపీ నాయకుడే కావొచ్చు. కానీ వాడికి శిక్షపడాలంటూ సాక్షాత్తూ వైసీపీ నేతలు నిరసన ప్రదర్శనలు చేయడం ఎంతవరకు కరెక్ట్. తప్పు చేసినవాడికి శిక్ష విధించే క్రమంలో తమ హయాంలోనే ఆ తప్పు జరిగిందంటూ వైసీపీ గొప్పలు చెప్పుకున్నట్టుంది కదా. 

బాలిక తన లేఖలో నేరుగా ఆ నీఛుడి పేరు ప్రస్తావించింది కాబట్టి విచారణ ఆలస్యం కాకుండా అతడిని పట్టుకోగలిగారు. ఇక్కడ పోలీసుల ప్రతిభ ఏమీ లేదు. నిజంగా ఆ శాడిస్ట్ కి మరణ శిక్ష వేయించగలిగితే, శిక్ష పడటంలో ఆలస్యం జరగకుండా చూడగలిగితేనే పోలీసులు, ప్రభుత్వం గొప్పతనం బయటపడుతుంది.

దిశ చట్టం అమలులోకి వచ్చి ఉంటే..?

దిశ చట్టాన్ని తీసుకురావడంపై పెట్టిన శ్రద్ధ, దానికి కేంద్రం నుంచి అనుమతి సాధించడంలో పెట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగానే దిశ చట్టం అమలులోకి వచ్చి ఉంటే ఇలాంటి వారికి తొందరగా కఠిన శిక్షలు పడేవి, ప్రస్తుతం పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక్కడ పార్టీలను ఎవరూ తప్పుబట్టలేరు. తప్పు చేసినవాడు ఎవడైనా శిక్ష పడాల్సిందే. ఆ శిక్ష ఏ స్థాయిలో ఉండాలి, ఎంత తొందరగా పడాలి అనేదే ఇప్పుడు సమాజం ఆలోచించాలి. అది మరొకరికి గుణపాఠం కావాలి, మరోసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి.

కానీ అనుకోకుండా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నారీ దీక్షలంటూ టీడీపీ నేతలు, నారావారి నీఛాలు అంటూ వైసీపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ వివాదాలు, విమర్శలు పక్కనపెట్టి.. వినోద్ జైన్ ని ఉరికంబం ఎక్కించగలిగితేనే ప్రభుత్వంపై గౌరవం పెరుగుతుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?