ఉద్య‌మ‌కారుల‌తో పెట్టుకోవ‌ద్దు రేవంత్‌

తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని క‌విత ఆగ్ర‌హించారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై తీవ్ర వివాదం నెల‌కుంది. రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ఈ నెల 9న ఆవిష్క‌రించిన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఆ విగ్ర‌హం కాంగ్రెస్ త‌ల్లి విగ్ర‌హం అని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత రాజ‌కీయంగా యాక్టీవ్ అయ్యారు. తెలంగాణ త‌ల్లి అంశంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇవాళ మీడియాతో క‌విత మాట్లాడుతూ ఉద్య‌మ‌కారుల‌తో పెట్టుకోవ‌ద్ద‌ని సీఎం రేవంత్‌కు ఆమె హెచ్చ‌రిక చేశారు. తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని క‌విత ఆగ్ర‌హించారు. హస్తం గుర్తుతో ఉన్న తెలంగాణ తల్లి ప్రజలకు ఏం అవ‌స‌ర‌మ‌ని ఆమె నిల‌దీశారు. ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్లెవ‌రూ బాగుపడలేదని చెప్పారు.

ఉద్యమ కాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని క‌విత ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెట్టిన విగ్ర‌హంలో ప్రత్యేకత ఏముంద‌ని ఆమె నిల‌దీశారు. జొన్నలు, మక్కలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పండవా అని క‌విత ప్ర‌శ్నించారు.

తెలంగాణలో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అని, దానికి విగ్ర‌హంలో చోటు ఎక్క‌డుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఉద్యమకాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు కోరుకున్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు.

4 Replies to “ఉద్య‌మ‌కారుల‌తో పెట్టుకోవ‌ద్దు రేవంత్‌”

  1. అసలు రూపమే తెలియని తల్లి ఎలా చెక్కితే ఏమిటి ? అందులో భావం కదా చూడాలి ?

    భారతమాత రూపం ఇది కాదు అంటే ఎలా ఉంటుంది కామెడీ గ , అలాగే ఉంది ఈ వాదన

Comments are closed.