హైకోర్టులో రాంగోపాల్‌వ‌ర్మ‌కు ఊర‌ట‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వర్మ‌కు ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వర్మ‌కు ఏపీ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వ‌ర్మ‌పై సోష‌ల్ మీడియాలో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై పోస్టులు, అలాగే సినిమా పోస్ట‌ర్ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ కూట‌మి శ్రేణులు కేసులు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

వీట‌న్నింటిపై ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను వ‌ర్మ‌కు హైకోర్టు మంజూరు చేయ‌డం విశేషం. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ర‌ని వ‌ర్మ‌కు హైకోర్టు సూచించింది. ఎప్పుడో ఏడాది, రెండేళ్ల క్రితం సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై ఇప్పుడు సంబంధం లేని వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని వ‌ర్మ త‌న మార్క్ వాద‌న వినిపించారు.

ఈ నేప‌థ్యంలో వ‌ర్మ బెయిల్‌పై ప‌లు ద‌ఫాలుగా విచార‌ణ జ‌రిగింది. ఇవాళ తీర్పు వెలువ‌డింది. వ‌ర్మ‌కు బెయిల్ మంజూరు చేయ‌డంతో ప్ర‌భుత్వానికి గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్టైంది. ఇప్ప‌టికే ప‌ల్నాడు జిల్లా పోలీసులు విచార‌ణ‌కు రావాలంటూ ఒక‌ట్రెండు సార్లు వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చారు. కానీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాన‌ని, దీంతో వ‌ర్చువ‌ల్‌గా మాత్ర‌మే విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని ఆయ‌న అన్నారు.

కానీ పోలీసులు అందుకు అంగీక‌రించ‌లేదు. మ‌రోవైపు వ‌ర్మ న్యాయ‌పోరాటం చేశారు. చివ‌రికి వ‌ర్మ కోరుకున్న‌ట్టుగానే న్యాయ స్థానంలో ఊర‌ట ద‌క్కింది. వ‌ర్మ‌ను అరెస్ట్ చేయాల‌న్న ప్ర‌భుత్వ కోరిక నెర‌వేర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

3 Replies to “హైకోర్టులో రాంగోపాల్‌వ‌ర్మ‌కు ఊర‌ట‌”

  1. లాజిక్ కా బాప్… ఆయనని కెలికి అభాసు పాలు అవడం ఎందుకు? ఆయన వాదన కరెక్ట్ కదా? వేరే ఎవరికో మనోభావాలు దెబ్బతినడం ఏంటి?

Comments are closed.