ఒక్క చాన్సూ పోయినట్లేనా?

ఏపీ కేబినెట్‌లో ఖాళీగా ఉన్నది ఒకే ఒక బెర్త్. ఆ ఒక్కటి ఎవరికోసం అన్నది అంటే “నాకే” అనుకుంటూ అందరూ ఆశపడుతున్నారు.

ఏపీ కేబినెట్‌లో ఖాళీగా ఉన్నది ఒకే ఒక బెర్త్. ఆ ఒక్కటి ఎవరికోసం అన్నది అంటే “నాకే” అనుకుంటూ అందరూ ఆశపడుతున్నారు. ఉత్తరాంధ్రలో చూస్తే, శ్రీకాకుళం నుంచి విశాఖ దాకా టీడీపీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. జనసేన నుంచి కూడా ఆశించిన వారూ ఉన్నారని ప్రచారం సాగింది.

టీడీపీ నుంచి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో కూన రవికుమార్ మంత్రి పదవి రేసులో ఉన్నారని వార్తలు వినిపించాయి. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు తనకే మినిస్టర్ ఛాన్స్ అనుకుంటున్నట్లు భావించారు. ఎస్. కోటకు చెందిన కోళ్ళ లలిత కుమారి కూడా ఆశ పడుతున్నారని సమాచారం. రాజుల కోటాలో పూసపాటి వారి ఆడపడుచు అదితి గజపతిరాజు పేరు కూడా పరిశీలించే అవకాశం ఉందని అనుకున్నారు.

విశాఖ జిల్లాలో అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు మొదటి వరసలోనే ఉంటుందని ఆయన అభిమానులు భావించారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా 25 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి కావచ్చునని ఆశిస్తున్నారు.

అనకాపల్లి నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. అనకాపల్లి హిస్టరీలో ఎవరు ఎమ్మెల్యే అయినా మంత్రి కావాల్సిందే అన్న సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు.

పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు అవకాశం ఉండే అవకాశం ఉందని భావించారు. ఇలా లిస్ట్‌లో చూస్తే చాలా మంది పేర్లు ఉన్నాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా నాగబాబు చంద్రబాబు కేబినెట్‌లో 25వ మంత్రి కాబోతున్నారు. దాంతో ఆ ఒక్క చాన్స్ మిస్ అయినట్లేనా అని ఆశావహులతో పాటు అనుచరులలోనూ నిరాశ కనిపిస్తోంది.

6 Replies to “ఒక్క చాన్సూ పోయినట్లేనా?”

  1. ఈ గ్యాస్ ఆంధ్ర పెద్ద మనిషికి గ్యాస్ కడుపుమంటతో పాటు గుద్ధ నొప్పి కూడా ఉన్నట్టుంది. ఆ గుద్ధ నొప్పి ఈయనను కుదురుగా ఉండనివ్వడం లేదు. అందుకే ప్రతి చిన్న దానికి పెద్ద దానికి ఎగరేగిరి పడుతుంటాడు

Comments are closed.