అఖిల‌ప్రియ‌తో మంచు మ‌నోజ్ భార్య‌కు పంచాయితీ!

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ‌తో మంచు మ‌నోజ్ భార్య‌, ఆమె చెల్లి మౌనిక‌కు ఆస్తుల పంచాయితీ వుంది.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియ‌తో మంచు మ‌నోజ్ భార్య‌, ఆమె చెల్లి మౌనిక‌కు ఆస్తుల పంచాయితీ వుంది. ఇంకా అఖిల‌ప్రియ కుటుంబం ఆస్తులు పంచుకోలేద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే మౌనిక ప‌లుమార్లు ఆస్తుల పంపిణీ విష‌య‌మై అఖిల‌ప్రియ‌ను అడిగిన‌ట్టు తెలిసింది. అయితే అఖిల‌ప్రియ ఆస్తుల పంపిణీపై నాన్చివేత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం మంచు కుటుంబంలో ఆస్తుల పంపిణీ వ్య‌వ‌హారం బ‌జారుకెక్కింది. తండ్రీకొడుకు మంచు మోహ‌న్‌బాబు, మ‌నోజ్‌కుమార్ ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. కొడుకే కాదు కోడ‌లు మౌనిక వ‌ల్ల కూడా త‌న‌కు ముప్పు వుంద‌ని మోహ‌న్‌బాబు త‌న ఫిర్యాదులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. దీంతో భూమా మౌనిక వార్త‌ల్లో నిలిచారు.

నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల‌ప్రియ కుటుంబ ఆస్తుల పంపిణీపై చ‌ర్చ జ‌రుగుతోంది. మౌనిక త‌ర‌చూ ఆస్తుల పంపిణీ గురించి అడుగుతున్నా, అక్క వైపు స‌రైన స్పంద‌న రాలేద‌ని ఆ కుటుంబ స‌న్నిహితులు చెబుతున్నారు. తిరుప‌తిలో జ‌గ‌త్‌, విఖ్యాత్ అనే థియేట‌ర్లు కూడా ఉన్నాయి. అవి కూడా అఖిల‌ప్రియ కుటుంబ ఆస్తులే. వీటిని కూడా పంచుకోవాల్సి వుంది.

భూమా కుటుంబ ఆస్తుల పంపిణీ కూడా రానున్న రోజుల్లో వివాదానికి దారి తీసే అవ‌కాశం వుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే మౌనిక కోరుకున్న‌ట్టు పుట్టింటి నుంచి ఆస్తుల పంపిణీ జ‌రిగే అవ‌కాశం లేద‌ని భూమా కుటుంబ ఆప్తులు చెబుతున్నారు. ఆస్తుల పంపిణీకి ముందుకొస్తే త‌ప్ప‌, ఎవ‌రి మ‌న‌సులో ఏముందో తెలిసే అవ‌కాశం లేద‌నే చ‌ర్చ ఆళ్ల‌గ‌డ్డ‌లో జ‌రుగుతోంది.

2 Replies to “అఖిల‌ప్రియ‌తో మంచు మ‌నోజ్ భార్య‌కు పంచాయితీ!”

  1. మొన్న వరకు అన్న / చెల్లి రచ్చ చూసాము ..నిన్న తండ్రి / కొడుకు రోత .. రేపు అక్క /చేల్లిల్ల కంపు అంటావు అంతేగా ..

Comments are closed.