Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమీర్ ఖాన్ లేదా ఈగ 2 ?

అమీర్ ఖాన్ లేదా ఈగ 2 ?

బాహుబలి 2 తరువాత ఏమిటి? రానా అప్పుడే తేజ డైరక్షన్ లో మరో సినిమాలో బిజీ అయిపోయారు. ప్రభాస్ సినిమా ఎప్పటి నుంచో ఫిక్స్ అయి వుంది. దాని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మరి అసలు బాహుబల సూత్రధారి రాజమౌళి సంగతేమిటి? కొన్నాళ్లు రెస్ట్ తీసుకుంటారా? లేదా మరో సినిమా స్టార్ట్ చేస్తారా? రాజమౌళి మనోగతం మీద కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. 

రాజమౌళి తెలుగు హీరోలతో సోలోగా మరి సినిమాలు చేయరని తెలుస్తోంది. ఒక్క మహేష్ బాబుతో కమిట్ మెంట్ వుంది కాబట్టి అది ఎప్పటికైనా చేస్తారట. అది కాక మరేం చేసినా నేషనల్ వైడ్ సినిమానేనట. అమీర్ ఖాన్ తో సినిమా చేయాలన్నది రాజమౌళి కోరిక. అమీర్ ఖాన్ ఓకె అంటే ఆ సినిమా చేస్తారట. లేదూ అంటే, ఈగ 2 చేయాలని మాత్రం వుందట. 

ఈగ 2 చేయాలని అని రాజమౌళి చాలా ధృఢంగా వున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఈగ 2 మీద ఓ లైన్ అయితే రాజమౌళి మదిలో రెడీగా వుందట. దానిపై ఆయన తండ్రి విజయేంద్ర  ప్రసాద్ వర్కవుట్ చేస్తున్నారట. ఈగ 2 చేసినా అది కూడా నేషనల్ లెవెల్ లోనే చేయాలన్నది రాజమౌళి సంకల్పంగా తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?