Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అవికకు అసభ్య మెసేజ్ లు చేసింది ఆ హీరోనేనా!

అవికకు అసభ్య మెసేజ్ లు చేసింది ఆ హీరోనేనా!

యువ హీరోహీరోయిన్లు అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక వాట్సాప్ గ్రూప్ తో ఏర్పడిన పరిచయాల నుంచి ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికా గోర్ కు ఒక యువహీరో నుంచి అసభ్యపూర్వకమైన మెసేజ్ లు వెళ్లడం, ఈ విషయం లో ఆమె తన సహనటీనటులకు ఫిర్యాదు చేయడం.. దీనికి ప్రతిగా వాళ్లు ఆమెను గ్రూప్ నుంచి బయటకు పంపేయడం.. ఈ వ్యవహారం అంతా ఆసక్తికరంగా ఉంది.

ఇక్కడ అవికకు మద్దతుగా కొంతమంది మాట్లాడటం, మరికొందరు.. ఆమెను ఉన్నట్టుండి గ్రూప్ నుంచి బయటకు పంపేయడం కూడా గమనించాల్సిన విషయమే. అవిక చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తోందని వాళ్లు అభిప్రాయపడ్డారట. అయితే సాయిధరమ్ తేజ్, హెబ్బా పటేల్, రకుల్ ప్రీత్ లు అవికకు సపోర్ట్ గా నిలిచారు. ఈ గ్రూప్ లో సభ్యులు అయిన వరుణ్ తేజ్, రాజ్ తరుణ్, నిఖిల్ తదితరులు మాత్రం అవికను గ్రూప్ నుంచి బయటకు పంపడానికి మొగ్గు చూపించినట్టుగా తెలుస్తోంది.

మెసేజ్ లు పంపిన హీరోకి మద్దతుగా నిలిచిన వారి దృష్టిలో.. అసభ్య మెసేజ్ లు అనేవి కామన్ అయ్యుండొచ్చు. అందులో తప్పు లేకపోయి ఉండవచ్చు. అందుకే వీరు సదరు హీరోకి మద్దతుగా నిలిచారు. 

మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? అనేది ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం. దీని గురించి వాకబు చేస్తే.. గతవారంలో విడుదలైన ఒక సినిమాలో హీరో అనే మాట వినిపిస్తోంది! సినీ నేపథ్యం లేకపోయినా కొన్ని విజయవంతమైన సినిమాలతో నిలదొక్కుకునే సరికి.. అతడు ఈ రకంగా పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడని టాక్. చిన్నవాడు.. కాస్త తగ్గితే మేలేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?