రూ….పాయె.!

నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక రూపాయి పరుగులు పెడ్తోంది.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలపడ్తుండడంతో మార్కెట్లు చాలా హుషారుగా వున్నాయి. రూపాయి బలపడ్తుండడం దేశానికి చాలా మంచిదే. కానీ, గత కొన్ని రోజులుగా రూపాయి…

నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక రూపాయి పరుగులు పెడ్తోంది.. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలపడ్తుండడంతో మార్కెట్లు చాలా హుషారుగా వున్నాయి. రూపాయి బలపడ్తుండడం దేశానికి చాలా మంచిదే. కానీ, గత కొన్ని రోజులుగా రూపాయి విలువ బలహీనపడ్తుండడం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది.

గతంలో రూపాయి విలువ పతనంలో సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. ఓ దశలో డెబ్భయ్‌ దాటి ఎనభైని టచ్‌ చేస్తుందేమోనని అంతా ఆందోళన చెందారు. ఆ టైమ్‌లో పెట్రోల్‌ ధరలు మాత్రమే కాదు, ఉల్లిధరలూ.. ఆఖరికి ఉప్పు ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సెంచరీని ఏది టచ్‌ చేస్తుంది.? ఉల్లి ధరా.? ఉప్పు ధరా.? డాలర్‌తో రూపాయి విలువా? అని కొందరు సెటైర్లు వేసుకున్నారు కూడా.

ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతమవుతాయేమోనన్న ఆందోళన వ్యకమవుతోంది. 61కి అటూ ఇటూగా తచ్చాడిన రూపాయ్‌, తాజాగా 62ని దాటేసింది. ఏమో.. రానున్న రోజుల్లో మళ్ళీ రూపాయి భయపెడ్తుందేమోనని మార్కెట్‌ వర్గాల్లో ఆందోళన నెలకొంది. రూపాయి విలువ పతనమైతే పెట్రోల్‌ దగ్గర్నుంచి, చాలా వస్తువుల ధరలకు రెక్కలొచ్చేస్తాయి. అయితే మార్కెట్‌ రంగ నిపుణులు మాత్రం, రూపాయి పతనం తాత్కాలికమేననీ, ఆందోళన చెందాల్సిన పనేమీ లేదంటున్నారు.

పతనం ఆగిపోతే మంచిదే.. అలా కాదని పతనం కొనసాగితే మాత్రం, ఇబ్బందికరమైన పరిస్థితే. మోడీ ఇమేజ్‌ పడిపోయిందనడానికి రూపాయి పతనమే నిదర్శనమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న దరిమిలా, రూపాయి బలోపేతానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.