ఆవిడ మీద గౌరవంతో ఇంకెవర్నీ పెట్టలేదు

ఒక ప్రోగ్రామ్‌లో పాపులర్‌ అయినవాళ్ళు మారితే ఆ కార్యక్రమానికి ఇబ్బందే. ఒక టీమ్‌ సక్సెస్‌ఫుల్‌గా కుదిరాక ఎలాంటి మార్పులు జరిగినా ప్రేక్షకులు తట్టుకోలేరు. ఈటీవీలో వచ్చే కామెడీ ప్రోగ్రామ్‌ జబర్‌దస్త్‌లో హోస్ట్‌ ‘రోజా’ లేకుండా…

ఒక ప్రోగ్రామ్‌లో పాపులర్‌ అయినవాళ్ళు మారితే ఆ కార్యక్రమానికి ఇబ్బందే. ఒక టీమ్‌ సక్సెస్‌ఫుల్‌గా కుదిరాక ఎలాంటి మార్పులు జరిగినా ప్రేక్షకులు తట్టుకోలేరు. ఈటీవీలో వచ్చే కామెడీ ప్రోగ్రామ్‌ జబర్‌దస్త్‌లో హోస్ట్‌ ‘రోజా’ లేకుండా ఊహించుకోగలమా? కానీ ఒక ఎపిసోడ్‌లో అయితే రోజా లేకుండా ఆ కార్యక్రమం చప్పగా సాగింది. పక్కన రోజా లేకపోయేసరికి నాగబాబు బోసిపోయి కనిపించాడు. 

జబర్‌దస్త్‌ ప్రోగ్రామ్‌కి రోజా ఎందుకు డుమ్మా కొట్టింది.? అని ఆరా తీస్తే, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా తప్పకుండా హాజరు కావాలి కాబట్టి రోజా బిజీ అయిపోయిందట. అయినాసరే ఆవిడ ప్లేస్‌లో పొరపాట్న కూడా ఇంకో సెలబ్రిటీని కూర్చోబెట్టకుండా రోజా గౌరవాన్ని కాపాడారు జబర్‌దస్త్‌ నిర్మాతలు. రోజా లేని ఆ ప్రోగ్రామ్‌ డల్‌గా కనిపించింది. 

నిజానికి ఆవిడ ప్రోగ్రామ్‌లో వున్నప్పుడు ఆవిడ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, నవ్వులుగానీ, కామెంట్స్‌గానీ ప్రత్యేకం. అంతలా ఇన్‌వాల్వ్‌ అయ్యి చెయ్యగల నటి ఇంకొకరు లేరంటే ఒప్పుకుని తీరాల్సిందే. ఈ రోజుకి కూడా రోజా తనదైన స్టయిల్లో డాన్సులు చేస్తూ గ్లామర్‌ ఒలకబోస్తూ చేసే ఆ ప్రోగ్రామ్‌ సక్సెస్‌లో రోజా పాత్ర ఎంతయినా వుంది. ఒక్కోసారి ఆర్టిస్టులు చేసే కామెడీ బాగా లేకపోయినా రోజా చేసే కామెంట్స్‌ సంతృప్తినిస్తాయని హాస్య ప్రియులంతా చెబుతారు. అలాంటి రోజా లేకుండా ప్రోగ్రామ్‌ చేస్తే అసలుకే ఎసరొస్తుంది మరి.