లయన్ లో సంప్రదాయ ఐటమ్

సినిమా అన్నాక ఐటమ్ సాంగ్ మస్ట్..అందునా కమర్షియల్ సినిమా అయితే మరీనూ. బాలకృష్ణ నటిస్తున్నా తాజా సినిమా లయన్ లో కూడా ఓ అయిటమ్ సాంగ్ లాంటిది వుందట. హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని విశ్వ…

సినిమా అన్నాక ఐటమ్ సాంగ్ మస్ట్..అందునా కమర్షియల్ సినిమా అయితే మరీనూ. బాలకృష్ణ నటిస్తున్నా తాజా సినిమా లయన్ లో కూడా ఓ అయిటమ్ సాంగ్ లాంటిది వుందట. హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి, ఆఖరికి దొరికిన వేషాలతో సర్దుకుపోతున్న అర్చన ఈ పాటలో కనిపిస్తోంది. 

అయితే ఆమెను తీసుకోవడానికి కారణం..అది సంప్రదాయ నృత్యగీతం కావడమేనట. కృష్ణుడి మీద తయారుచేసిన గీతంలో అర్చన గోపిక వేషంలో కనిపిస్తుంది. అర్చన మంచి నృత్య కళాకారిణి అన్న సంగతి తెలిసిందే.అందుకే ఆ పాటకు ఆమెను ఎంపిక చేసినట్లున్నారు. 

ఏమయైతేనేం..ఆఖరికి బాలయ్య సినిమాలో తళుక్కున మెరుస్తుందన్నమాట అర్చన.