త్రివిక్రమ్ కొన్నాళ్లు ఖాళీనా?

మాటల మాంత్రికుడు, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీగా వుండడం అంటే కాస్త ఆశ్చర్యమే. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ పరిస్థితి కనిపిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి పూర్తయిపోయింది. కానీ సినిమా చేద్దామంటే హీరోలు రెడీగా…

మాటల మాంత్రికుడు, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖాళీగా వుండడం అంటే కాస్త ఆశ్చర్యమే. కానీ ఇప్పుడు అనుకోకుండా ఆ పరిస్థితి కనిపిస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి పూర్తయిపోయింది. కానీ సినిమా చేద్దామంటే హీరోలు రెడీగా లేరు. 

ఎన్టీఆర్-సుకుమార్, మహేష్-కొరటాల శివ-శ్రీకాంత్ అడ్డాల, రామ్ చరణ్-శ్రీనువైట్ల, బన్నీ-బోయపాటి, పవన్-బాబి, ప్రభాస్-సుజిత్, ఇలా అందరూ కమిట్ అయిపోయి వున్నారు. నిజానికి త్రివిక్రమ్ చేస్తానంటే, అందరూ రెడీనే. కానీ పాపం ముందుగా కమిట్ అయిన డైరక్టర్లు బాధపడతారు. 

అందుకే కాస్త గ్యాప్ తీసుకుంటాడా? లేక ఎవరితోనైనా సమాంతరంగా ఓ సినిమా కానిస్తాడా? చూడాలి.