టాలీవుడ్ సమ్మె ఏ దిశగా వుందో, ఎప్పుడు విరమణ సాధ్యమవుతుందో ఎవరికీ తెలియడం లేదు. రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా కేవలం ఎన్టీఆర్-పూరి సినిమాను దెబ్బతీయడానికి జరుగుతున్న వ్వవహారం అని కూడా వదంతులు వినిపిస్తున్నాయి.
పండుగకు విడుదలయ్యే సినిమాల్లో గోపాల గోపాల, టెంపర్, ముకుంద వున్నాయి.ముకుంద దాదాపు పూర్తయింది. గోపాల గోపాల యూనిట్ తెలివిగా కాశీకి వెళ్లిపోయి అక్కడ ఫినిష్ చేసుకుంటోంది.
అందుకోసం టాలీవుడ్ యూనియన్లతో సంబంధం లేని వారిని ఎంగేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టెంపర్ వ్యవహారం అలా కాదు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వేసారు. పోలీస్ స్టేషన్ సెట్ కూడా అందులో భాగం. అక్కడే షూట్ చేయాలి. అది చేయాలంటే సమ్మెవిరమణ కావాలి.
ఏ మాత్రం మరో పది రోజులు ఆలస్యమైనా, టెంపర్ పండుగకు విడుదల కావడం అసాధ్యమవుతుంది. కొందరు కావాలనే సమ్మెను సాగదీస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమో అన్నది టాలీవుడ్ పెద్దలకే తెలియాలి.