నన్నలా గాల్లోకి ఎత్తేస్తాడనుకోలేదు

చూడటానికి సన్నగా కరెంట్‌ తీగలా కనిపిస్తున్నాడు.. వీడేం చేస్తాడనుకుంటున్నావేమో.. దీనబ్బ తాకితే కరెంట్‌ పాసయ్యి మసైపోతావు.. అనే సినిమా డైలాగ్‌లోలాగానే అల్లరి నరేష్‌ కూడా ఎంతో పవర్‌ఫుల్‌. సన్నగా వున్నా మంచి స్టామినా కలవాడు.…

చూడటానికి సన్నగా కరెంట్‌ తీగలా కనిపిస్తున్నాడు.. వీడేం చేస్తాడనుకుంటున్నావేమో.. దీనబ్బ తాకితే కరెంట్‌ పాసయ్యి మసైపోతావు.. అనే సినిమా డైలాగ్‌లోలాగానే అల్లరి నరేష్‌ కూడా ఎంతో పవర్‌ఫుల్‌. సన్నగా వున్నా మంచి స్టామినా కలవాడు. ఈటీవీలో పాపులర్‌ షో జబర్‌దస్త్‌ కామెడీ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వెళ్ళాడు. 

తెల్లారితే ఆయన సినిమా ‘బందిపోటు’ రిలీజ్‌. కాబట్టి, పబ్లిసిటీ కోసం వచ్చి  కూర్చుని, ఆ షోలోని కామెడీని అంతా ఆస్వాదించి, పనిలో పనిగా తన సినిమాని కూడా ఆదరింమచమని ఆ ప్రోగ్రామ్‌ ద్వారా ఆడియన్స్‌ని కోరాడు. ఫైనల్‌గా చిన్న డాన్స్‌ మూమెంట్‌ చెయ్యమని యాంకర్‌ రేష్మి అడిగినప్పుడు ‘యా.. షూర్‌.. అయితే నా పక్కన రోజాగారుండాలి..’ అని కోరాడు. 

నరేష్‌ కోరికను సహృదయంతో మన్నించిన రోజా, అతనితో డాన్స్‌ చెయ్యడానికి వచ్చింది. సన్నటి నరేష్‌, గుమ్మడికాయ లాంటి రోజా.. అమాంతం రెండు చేతులతో పైకెత్తేసి, అవలీలగా గాల్లోకి తిప్పి వదిలాడు.. దాంతో రోజా ఎంతో సిగ్గుపడిపోయింది. కడవంత గుమ్మడికాయ కూడా కత్తి పీటకు లోకువేనని ఊరికే అనలేదు కదా పెద్దలు. 

అమ్మాయిలు ఎంత వెయిట్‌ వున్నా, పైకి ఎత్తేసే సత్తా మగాళ్ళకు వుంటుందని నరేష్‌ నిరూపించాడు. నరేష్‌ అలా తనని పైకి ఎత్తేస్తాడని అస్సలు ఊహించలేదు సుమీ.. అని రోజా ఆనక బోలెడంత ఆశ్చర్యపోవడం విశేషం.