‘మా పెరటి జాంచెట్టు మిమ్మల్ని కుశలం అడిగే..’ ఈ పాట గుర్తుంటే మీకు ఓ గొప్ప సెక్సీ భామ గుర్తుకొస్తుంది. ఆవిడెవరంటే రవళి. ఆమె నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా పెళ్ళి సందడి. సందర్భం ఏమిటంటే దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో నిర్వహించే సౌందర్య లహరి కార్యక్రమానికి హీరోయిన్ రవళి, హీరో శ్రీకాంత్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి హాజరయ్యారు.
అప్పటి జాంపళ్ళ సుందరి రవళి మాత్రం పుచ్చకాయలా ఊరిపోయి, గ్రాండ్‌గా కనిపించింది. అయితే ఆవిడ కళ్ళలో ఆ గ్లో మాత్రం తగ్గలేదు. ఎన్నో పాత జ్ఞాపకాలను కళ్ళ ముందు మెదిలేసరికి రవళి సహృదయంతో కదిలిపోయింది. అలాంటి రోజులు మళ్ళీ రావు కదా.. అనే దైన్యం కూడా ఆమెలో కనబడిరది.
రవళి నాభి మీద పడే జాంపండు గురించీ, ఆ రోజుల్లో ఇంటికో జాంచెట్టు పెంచుకున్న తెలుగువారి గురించీ ఎన్నో ముచ్చట్లు సాగాయి. రవళి మాత్రం తన సైజ్‌ని కాస్త తగ్గించుకోగలిగితే మళ్ళీ అవకాశాలు రావొచ్చు. బెస్టాఫ్ లక్ రవళీ.