కొరటాల శివ కాపీ కొట్టాడా?

శ్రీమంతుడు సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టేసాడు రచయిత కమ్ దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఈ సినిమా కథ తనదని, కాపీ కొట్టేసారని అంటున్నాడో రచయిత. పేరు శరత్ చంద్ర. 2012లో…

శ్రీమంతుడు సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టేసాడు రచయిత కమ్ దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఈ సినిమా కథ తనదని, కాపీ కొట్టేసారని అంటున్నాడో రచయిత. పేరు శరత్ చంద్ర. 2012లో స్వాతి మాసపత్రికలో ఓ నవల రాసారట. దాని పేరు చచ్చేంత ప్రేమ. ఈనాడు, ఆంద్రజ్యోతిలో జర్నలిస్టుగా కూడా పనిచేసిన ఈ రచయిత ఆ నవలను నారా రోహిత్ తొ సినిమా గా చేయాలుకున్నాడట. ఈయనకు సినిమా రచయితల సంఘంలో మెంబర్ షిప్ కూడా వుందట. ఇంతకీ ఆ చచ్చేంత ప్రేమ నవల లో పాయింట్లు ఏమిటంటే..

వెలుగోడు ప్రాజెక్టు నేపథ్యంలో కథ సాగుతుంది భూమికి పరిహారంగ భూమి కావాలని ఫైట్ చేస్తుంటారు. అలాంటి నేపథ్యంలో జగపతిబాబు లాంటి క్యారెక్టర్ ఎమ్మెల్యే అయి, ప్రజల సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన వస్తుంది. కానీ అనుకోకుండా అతగాడు ఊరికి దూరం కావాల్సిన పరిస్థితులు వస్తాయి. కట్ చేస్తే..అతగాడు బయటకు పోయి, ఎదిగి హోమ్ మినిస్టర్ అవుతాడు. అతగాడి కొడుకే హీరో. కాలేజీలో అమ్మాయితో పరిచయం అవుతుంది. ప్రేమ చిగురించాక ఆ అమ్మాయికి ఇతగాడి తండ్రి గురించి తెలిసి, దూరం పెడుతుంది. ఎందుకని ఆరా తీస్తే, ఎవరు చస్తే తమ ఊరు దీపావళి చేసుకుంటుందో వాడి కొడుకే నువ్వని చెబుతుంది. దాంతో హోమ్ మినిస్టర్ కొడుకు ఆ  ఊరుకు వెళ్లి, తండ్రికి తెలియకుండా, తండ్రి పిఎ సహాయంతో ఆ ఊరికి ప్రభుత్వం చేత అన్ని సదుపాయాలు కలుగ చేస్తాడు.సినిమా లో ఊరి పేరు దేవరకోట అయితే నవలలో దేవర కొండ. . ఇదీ కథ.

తాను గడచిన నెల రోజులుగా స్వంత పనిపై కేరళలో వున్నానని, ఇక్కడ తన నవల చదివిన రచయిత మిత్రులు కొందరు ఫోన్ చేసి విషయం తెలిపారని శరత్ చంద్ర అంటున్నారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చాక, సినిమా చూసానన్నారు. తను, తన మిత్రులు నారా రోహిత్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు శ్రీమంతుడు సినిమా కోసం ఇలా చేయడం ద్వారా మొత్తం ఆగిపోయిందని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటున్నారు శరత్ చంద్ర. మరి దీనికి రచయిత కొరటాల శివ ఏమంటారో? కో ఇన్సిడెన్స్ అంటారో, మరే మంటారో?

గతంలో కూడా ఆంధ్రభూమి వీక్లీలో వచ్చిన నవలను రాజమౌళి మగథీర సినిమా కోసం కోట్టేసారని కోర్టు కేసు పడింది. అది ఏ స్థాయిలోవుందో తెలియదు. అలాగే అడపా చిరంజీవి అనే రచయిత, తన నవలను వంశీ అండ్ కో తమ ‘ఔను వాళ్లు ఇద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో వాడేసారని కోర్టులో కేసు వేసారు. అదేమయిందో తెలియదు.

ఏమైనా భావచౌర్యం చేస్తే మాత్రం, అది ముమ్మాటికీ తప్పే. అన్ని చౌర్యాల కన్నా మేథో చౌర్యం అథమం  అంటారు కదా పెద్దలు.