మారుతి బాటలో హరీష్ శంకర్

తాము చేసిన సినిమా హక్కులు కొనుక్కోవడం అన్నది డైరక్టర్లకు ఈ మధ్య అలవాటుగా మారింది. తమ ప్రొడక్ట్ మీద తమకు నమ్మకం వుండడం ఒక కారణం కావచ్చు. లేదా ఈ విధంగా కూడా కాస్త…

తాము చేసిన సినిమా హక్కులు కొనుక్కోవడం అన్నది డైరక్టర్లకు ఈ మధ్య అలవాటుగా మారింది. తమ ప్రొడక్ట్ మీద తమకు నమ్మకం వుండడం ఒక కారణం కావచ్చు. లేదా ఈ విధంగా కూడా కాస్త ఆదాయం చేసుకుందామన్న అయిడియా కావచ్చు. భలేభలేమగాడివోయ్ సినిమా ఓవర్ సీస్ హక్కుల్లో యాభై శాతం కొనుగోలు చేసారు మారుతి. అలాగే కృష్ణా జిల్లా హక్కులు కూడా కొన్నారు. ఇప్పుడు మంచి లాభాలు చేసుకున్నారు. 

అలాగే మరో డైరక్టర్ హరీష్ శంకర్ కూడా ఇదే పని చేసారని తెలుస్తోంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ఓవర్ సీస్ హక్కుల్లొ పాతిక శాతం షేర్ హరీష్ తీసుకున్నారని తెలుస్తోంది. దిల్ రాజు హక్కులను ఓవర్ సీస్ పార్టీకి అమ్మేసారు. 

అయితే ఆ పార్టీ దగ్గర మళ్లీ హరీష్ శంకర్ పాతిక శాతం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన సినిమా మీద పిచ్చ కాన్ఫిడెన్స్ తో హరీష్ ఈ బేరానికి దిగాడని వినికిడి.మరి చూడాలి మారుతి మాదిరిగానే హరీష్ ను  కూడా అదృష్టం వరిస్తుందో లేదో?