రెండేళ్ల నుంచి వెదికినా తగిన వరుడే దొరకలేదట

పెళ్లంటే నూరేళ్ల పంట. సినిమా పెళ్లిళ్లు జరిగినంత ఈజీ కాదు. ఎంతటి పేరుప్రఖ్యాతులున్నా అమ్మాయిలకు వెంటనే పెళ్లయిపోతుంది అనుకోవడం పొరపాటు. రెండేళ్ల నుండి వెదుకుతున్న ప్రియమణికి సరైన వరుడు దొరకడం లేదట. హీరోయిన్‌గా వెలిగిపోయిన…

పెళ్లంటే నూరేళ్ల పంట. సినిమా పెళ్లిళ్లు జరిగినంత ఈజీ కాదు. ఎంతటి పేరుప్రఖ్యాతులున్నా అమ్మాయిలకు వెంటనే పెళ్లయిపోతుంది అనుకోవడం పొరపాటు. రెండేళ్ల నుండి వెదుకుతున్న ప్రియమణికి సరైన వరుడు దొరకడం లేదట. హీరోయిన్‌గా వెలిగిపోయిన ప్రియమణి ఇక పెళ్లి ఒక్కటే మిగిలింది అనుకొని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే ఆమె తల్లి దండ్రులు వరుడి వేటలో పడ్డారట. 

ఎవరో ప్రవాసాంధ్రుడు దుబాయ్‌లో సెటిలయ్యి ప్రియమణిని పెళ్లాడడానికి ముందుకొచ్చాడట. కానీ అతని చరిత్ర అంత గొప్పది కాదట. ఆల్రెడీ ఒకావిడకు విడాకులిచ్చేసి ఉన్నాడట. పోయిపోయి రెండో పెళ్లి వాడికి ప్రియమణిని ఎలా ఇస్తారు. డబ్బు.. హోదాకు కక్కుర్తి పడితే ఈవిడకూ విడాకులు ఇవ్వడని గ్యారంటీ ఏంటీ. కాబట్టి మంచి యోగ్యుడు. అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వాడికోసం ఎదురుచూస్తున్నారట. 

అయితే ప్రియమణి కూడా పెళ్లయ్యే వరకూ ఖాళీగా ఎందుకుండాలి. ఏవైనా సినిమాలొస్తే చెయ్యాలనే ఆలోచనలోనూ ఉందట. ప్రియమణిలాంటి అమ్మాయికే పెళ్లవ్వడానికి ఇంత టైం పడితే మామూలు అమ్మాయిల సంగతేంటీ. ఆవిడకు తొందరగా పెళ్లయ్యి ఒకింటిదవ్వాలని మనం కూడా మనసారా దీవించేద్దాం.