అమ్మాయిలను చూసి అబ్బాయిలు నోరెళ్లబెట్టినట్టుగా అమ్మాయిలు కనిపించరుగానీ వాళ్లకు కొన్ని భావనలు హంటింగ్ చేస్తుంటాయనేది నిజం. ఎయిటీస్‌లో నెంబర్‌వన్ హీరోయిన్గా వెలిగిపోయిన శ్రీదేవి కోసం ఎంతో మంది నిద్రలేని రాత్రులు గడిపేవారంటే అతిశయోక్తి కాదు. శ్రీదేవి అంటే దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యగానే భావించేవారట.
అలాంటి శ్రీదేవి కూడా యుక్త వయస్సులో ఒక వీరుణ్ణి చూసి మనసు పారేసుకున్నట్లు అప్పట్లో ఒక ఇంటర్య్వూలో శ్రీదేవి స్వయంగా చెప్పుకుంది. రాంబో సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ‘సిల్వెస్టర్ స్టాలోన్’ అంటే శ్రీదేవివి చాలా క్రష్అట. అలాంటి మగాడు తనకెంతో ఇష్టం అనీ, వీలుంటే అతన్ని పెళ్ళాడడానికి కూడా రెడీ అని చెప్పేసిన శ్రీదేవి ఫైనల్‌గా బోనీకపూర్‌కి భార్య అయ్యింది.
ఎయిటీస్‌లో రాంబో సినిమా నుంచే స్ఫూర్తిగా ఖైదీ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు. అప్పట్లో సొసైటీ అమ్మాయిలు సిల్వెస్టర్ స్టాలోన్ పోస్టర్స్‌ని తమ రూంలో అతికించుకుని ఆనందం పొందే వారంటే ఆయన మగతనానికి శ్రీదేవి కూడా పడిపోవడం విశేషం కాదు.
ఒక సందర్భంలో రాంబోని కలిసిన శ్రీదేవి ఆయన ఆటోగ్రాఫ్ మాత్రం తీసుకుందట. అప్పటికే ఒక బిడ్డతల్లి అయిన శ్రీదేవి తన అభిమానాన్ని ఆయనతో చెప్పడానికి కూడా సిగ్గుపడిందట. అలా ఉంటాయి జీవితాలు అనుకున్నామని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని.