ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అది వ్యాపార సూత్రం. పివిపి సంస్థకు, నటి శృతిహాసన్ కు చిన్న తగాయిదా..కోర్టు దాకా వెళ్లింది. ఆఖరికి పివిపి సంస్థ కేసు విత్ డ్రా చేసుకుంది. దీని వెనుక తమిళ సినిమా పెద్దల రాయబారం వుందని వినికిడి.
Advertisement
సరే అయితే మరి ఇంతకీ శృతికి ఇచ్చిన అడ్వాన్స్ వగైరా మాటేమిటి? దానికోసం ఓ రాజీ ఫార్ములా కుదిరిందన్నది టాలీవుడ్ టాక్. పివిపి నిర్మించే ఓ సినిమాలో ఫ్రీగా స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకె అన్నట్లు తెలుస్తోంది. అది అనుష్క నటించే సైజ్ జీరో కావచ్చు కూడా.