సావిత్రి సినిమా శ్రీదేవిగా మారడం వెనుక ఎంతో అలజడి చెలరేగింది. నిజానికి సావిత్రి ఒక్కతే పతివ్రత కాదు కదా.. మహా విష్ణువు భార్య శ్రీదేవి కూడా పతివ్రతే. సావిత్రి టైటిల్ తీసి, శ్రీదేవిగా మార్చడంలో వర్మే గెలిచాడు. జనం తమ ఇగోని చల్లార్చుకున్నారంతే. మనిషిలో స్వతహాగా వుండే భయం, సెక్స్ లాంటి వీక్‌నెస్‌లతో ఆడుకోవడం వర్మకు కొట్టిన పిండే. అయితే వర్మ తన స్థాయిని పెంచుకోకుండా, దిగజారుడుగా వ్యవహరించడమే విచారించదగ్గ విషయం. 1980 ప్రాంతాల్లో వచ్చిన మలయాళం సెక్స్ సినిమాలను పోలి వుండే కథతో, సత్రంలో ఒక రాత్రి.. ఆమె మధుర రాత్రులు.. లాంటి సినిమాలు ఇప్పుడెందుకు తీయాల్సి వచ్చిందో అర్థం కావడంలేదు.
రామ్‌గోపాల్ వర్మ స్కూల్ డేస్‌లో ఎవరో ఒక టీచర్‌ని సెక్సీగా చూసేవాడట. అది ఆయన మొదటి క్రష్ అట. ఇప్పుడు దాన్ని సినిమాగా తీసి జనం మీదకు వదులుతున్నాడు. వయసులో వ్యత్యాసం లేకుండా శృంగార భావాలు కలగడం జంతు లక్షణం. అలాంటి నీఛమైన పాయింటుతో సినిమా తియ్యడం ఆయనకు తగని పని. గతంలో దాసరి నారాయణరావు ‘నీడ’ అనే సినిమా కూడా ఇదే కథని పోలి వుంటుంది. కానీ ఆయన ఇంత పచ్చిగా పోస్టర్స్ వెయ్యలేదు.. ఇదేమి ఖర్మ వర్మగారూ.!