చరణ్ ఫైటింగ్ ట్రయినింగ్

శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లోని సినిమాలో హీరో తన సోదరి ఐఎఎస్ చదువుకోసం సినిమా ఫైట్ మాస్టర్ గా, డూప్ గా పనిచేస్తాడని ఇప్పటికే రివీల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫైట్లు వైవిధ్యంగా, వినూత్నంగా…

శ్రీనువైట్ల-రామ్ చరణ్ కాంబినేషన్ లోని సినిమాలో హీరో తన సోదరి ఐఎఎస్ చదువుకోసం సినిమా ఫైట్ మాస్టర్ గా, డూప్ గా పనిచేస్తాడని ఇప్పటికే రివీల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫైట్లు వైవిధ్యంగా, వినూత్నంగా వుండేందుకు రామ్ చరణ్ కసరత్తు మొదలెట్టాడట. 

బ్యాంకాక్ వెళ్లి కొన్ని ఫైటింగ్ టెక్నిక్ ల్లో  మెళకువలు నేర్చుకుంటున్నాడట. త్వరలో తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొంటాడట. అంతవరకు రామ్ చరణ్ కాంబినేషన్ లేని సీన్లు ఇక్కడ కానిచ్చేస్తున్నారు. ఈ సినిమా ఎలాగైనా దసరా సీజన్ కు తీసుకురావాలన్నది యూనిట్ ప్రయత్నం.