శరద్ మురార్ కు వాయింపు

మిత్రుడు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇచ్చాడు సినిమా చేసుకుందాం అనుకున్న శరద్ మురార్ కు ఖర్చు తడిపిమోపెడవుతున్నట్లు బోగట్టా. ఎప్పుడో ప్రారంభమైంది గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు. ఇప్పటి వరకు సెట్ ల…

మిత్రుడు పవన్ కళ్యాణ్ కాల్ షీట్లు ఇచ్చాడు సినిమా చేసుకుందాం అనుకున్న శరద్ మురార్ కు ఖర్చు తడిపిమోపెడవుతున్నట్లు బోగట్టా. ఎప్పుడో ప్రారంభమైంది గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్టు. ఇప్పటి వరకు సెట్ ల పైకి వెళ్లలేదు. ఆఫీసు, యూనిట్ లో కీలక సభ్యుల ఖర్చులు తప్పడం లేదు. తీసుకున్న అడ్వాన్స్ లపై వత్తిడి వస్తున్నట్లు కూడా తెలుస్తోంది. 

ఈ ఎన్నికల హడావుడి ఇంకా మరో పదిహేను, నెల రోజులు వుంటుంది. మోడీ ప్రభుత్వం వస్తే, పవన్ కాస్త ఢిల్లీ వెళ్లి, సమావేశాలకు గట్రా హాజరయ్యే అవకాశం వుంది. దానా దీనా మరో నెల రోజులకు కానీ గబ్బర్ సింగ్ 2 ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. 

అదీ కాక, ఏమన్నా తేడా జరిగితే, పవన్ కొన్నాళ్ల పాటు ఫార్మ్ హవుస్ కే పరిమితమయ్యే ప్రమాదం వుంది. ఇవన్నీ చూసుకుని, పెరిగిపోతున్న ఖర్చు తలచుకుని, శరద్ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో గ్యాసిప్ చక్కర్లు కొడుతోంది.