బాలయ్య వందో సినిమా మీద వచ్చినన్ని వదంతులు మరే సినిమా మీదా రాలేదేమో? బాలయ్యే డైరక్టర్ అని ఓ సారి, కాదు బోయపాటికే అవకాశం అని మరోసారి. కానీ అవన్నీ కాదని తరువాత తేలిపోయింది. తాజగా కొత్త పేరు ఒకటి తెరపైకి వచ్చింది. ఆది మరెవరిదో కాదు,. టాలీవుడ్ శంకర్…ఎస్ ఎస్ రాజమౌళి.
Advertisement
రాజమౌళికి సన్నిహితుడైన వారాహి అధినేత సాయి కొర్రపాటి ఈ సినిమాకు నిర్మాత అని వినికిడి. ఇటీవల కొంతకాలంగా సాయి కొర్రపాటి బాలకృష్ణకు కూడా సన్నిహితంగా వుంటున్నారు. ఆయనే ఈ ప్రాజెక్టు ను సాధ్యం చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. బాహుబలి తరువాతి ప్రాజెక్టుగా ఇది తెరకెక్కిస్తే, వచ్చే కలెక్షన్లే వేరప్పా.