లింగ, ఐ షాక్‌తో బేజారు

భారీ అంచనాలున్న సినిమాల్ని ఎలా ఉన్నా చూసేస్తారనే గ్యారెంటీ లేదు. అంచనాలు లేని సినిమాల్ని అయితే అంతంత మాత్రంగా ఉన్నా పాస్‌ చేసేస్తారు కానీ భారీ అంచనాలు ఉంటే మాత్రం తప్పకుండా ఆడియన్స్‌ని శాటిస్‌ఫై…

భారీ అంచనాలున్న సినిమాల్ని ఎలా ఉన్నా చూసేస్తారనే గ్యారెంటీ లేదు. అంచనాలు లేని సినిమాల్ని అయితే అంతంత మాత్రంగా ఉన్నా పాస్‌ చేసేస్తారు కానీ భారీ అంచనాలు ఉంటే మాత్రం తప్పకుండా ఆడియన్స్‌ని శాటిస్‌ఫై చేయాల్సిందే. లింగ, ఐ చిత్రాల పరాజయాలే దీనికి నిదర్శనం. 

ఈ చిత్రాలపై విడుదలకి ముందు గ్రాఫికల్‌ వండర్స్‌ అనే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడ్డాయి. కానీ రెండూ ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి. దాంతో రజనీకాంత్‌, శంకర్‌ల బ్రాండ్‌ ఇమేజ్‌ కూడా ఈ చిత్రాలని కాపాడలేకపోయింది. భారీ అంచనాలున్నా సినిమాలు ఇలా అయిపోవడంతో త్వరలో రాబోయే భారీ చిత్రాల బయ్యర్లు బేజారు అవుతున్నారు. 

టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌గా తీసుకుని గుడ్డిగా డబ్బులు ఇన్వెస్ట్‌ చేసేయకుండా ఒకవేళ తమకి ప్రతికూల ఫలితం వచ్చిన పక్షంలో కాంపెన్సేషన్‌ ఎలా ఇస్తారనే దానిపై ఇప్పుడే గట్టిగా అడిగేస్తున్నారు. లింగ, ఐ ఫెయిల్యూర్స్‌తో ఎలాంటి సినిమా అయినా ఫెయిలవుతుందని, సినిమాలో ఎవరున్నా గ్యారెంటీ లేదని, దర్శకుడు ఎవరైనా నమ్మడానికి లేదని ముద్ర పడిపోయింది. వీటి ప్రభావం రాబోతున్న భారీ సినిమాలపై బాగా పడింది.