Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రయోగాలిక చెయ్యనంటాడా.?

ప్రయోగాలిక చెయ్యనంటాడా.?

కళ్యాణ్‌రామ్‌ చాన్నాళ్ళ తర్వాత ‘పటాస్‌’ సినిమాతో హిట్‌ కొట్టాడు. మంచి టాక్‌ సంపాదించుకున్న ఈ సినిమాతో కళ్యాణ్‌రామ్‌ ఖుషీఖుషీగా వున్నాడు. కళ్యాణ్‌రామ్‌ కేవలం హీరో మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో చాలావరకూ ప్రయోగాత్మకమైనవే. ప్రయోగాత్మకం.. అంటే కొత్త దర్శకులతో చేసిన సినిమాలే ఎక్కువని. ‘ఓం’ సినిమా అయితే కొత్త దర్శకుడనే కాదు, కొత్త టెక్నాలజీ త్రీడీలో తీసిన యాక్షన్‌ ఫిలిం.

ఏ సినిమా నిర్మించినా, అందులో ఏదో ఒక వెరైటీ వుండాలని తపించే వ్యక్తి కళ్యాణ్‌రామ్‌. కొత్త దర్శకుల్లో కొత్త టాలెంట్‌ వుందని నమ్మేవారిలో కళ్యాణ్‌రామ్‌ ఒకడు. కానీ, కళ్యాణ్‌రామ్‌ ప్రయోగాలు, నమ్మకాలూ చాలావరకు బెడిసి కొట్టాయి. అయినాసరే, కొత్త దర్శకుల్నే అతను ఇంకా నమ్ముతున్నాడు. అలా కొత్త దర్శకుడితోనే ‘పటాస్‌’ అనే హిట్‌ కొట్టాడు కళ్యాణ్‌రామ్‌.

ఇకపైనా కొత్త దర్శకులతోనే ప్రయోగాలు చేయాలనుకుంటున్నాడుగానీ, ప్రయోగాత్మక చిత్రాలు మాత్రం చెయ్యాలని అనుకోవంలేదట ఈ యంగ్‌ హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌. బడ్జెట్‌ని అదుపులో పెట్టుకుని, ప్రయోగాత్మకంగా చిన్న సినిమాలు తెరకెక్కిస్తే, వాటిల్లో కంటెంట్‌ వుంటే ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. కళ్యాణ్‌ ఆ యాంగిల్‌లో ఆలోచిస్తే, అభిరుచి గల నిర్మాత అయిన కళ్యాణ్‌రామ్‌, న్యూ టాలెంట్‌కి ఆశాకిరణంలా మారతాడు. చూద్దాం.. కళ్యాణ్‌ ఆలోచనలు ‘పటాస్‌’ తర్వాత ఎలా వుంటాయో.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?