సిగ్గు లేని బ్రతుకులు …

తెలుగు భాషలో మాకు నచ్చని ఒకే ఒక్క పదం సిగ్గు. ఎందుకంటే మాకు సిగ్గు లేదు. Advertisement తెలంగాణ పేరుతో విడిపోతాం,ఛీ పొండి అన్నా, కలిసుందాం అని బ్రతిమాలతారు అంధ్రా అన్నలు. విడిపోతూ, కలిసి…

తెలుగు భాషలో మాకు నచ్చని ఒకే ఒక్క పదం సిగ్గు. ఎందుకంటే మాకు సిగ్గు లేదు.

తెలంగాణ పేరుతో విడిపోతాం,ఛీ పొండి అన్నా, కలిసుందాం అని బ్రతిమాలతారు అంధ్రా అన్నలు.

విడిపోతూ, కలిసి అభివ్రుద్ది చేసిన ఉమ్మడి ఆస్థి మాకు ఒక్కరికే కావాలంటారు తెలంగాణ తమ్ముళ్ళు.

ప్రాంతాల పేరుతో కొట్టుకొని, తీర్పు కోసం ఇటలీ అమ్మ, హిందీ చిన్నమ్మల కాళ్లు మొక్కుతాం.

మాలో మేము రాజీ పడం కాని లుంగీ వాడు, హిందివాలా కుట్ర చేసి విడగొట్టారు అని ఏడుస్తాం. 

ప్రాంతాల పేరుతొ మహనీయుల విగ్రహాలు పడగొడతాం, నిజాం అరాచక పాలనని పొగుడుతాం.

డిల్లీ వాడికో, గుజరాత్ వాడికో, లేదంటే ఇటలి ఆమెకో బానిసలుగా వుంటాం కాని పక్క ప్రాంతం తెలుగు వాడు నాయకుడంటే ఒప్పుకోం. 

PV, NTR, పొట్తి శ్రీరాములు, అల్లూరి లాంటి సొంత వాళ్లు మాకు గుర్తుండరు, దేనికైనా రాజీవ్,ఇందిర పేరు పెడతాం.

పదవి ఇస్తే అమ్మ అంటాం, లేదంటే ఇటలి మాఫియా అంటాం. ఒక ప్రాంతంలో గుడి కడతాం, వేరే దగ్గర సమాధి కడతాం.

ఉద్యమం పేరుతో కుటుంబం మొత్తం పదవులు పంచుకున్నా, డబ్బులు దొచుకున్నా పర్లేదంటాం, జాతిపిత అంటాం.

దేవుడి పాలనలో వేల కొట్లు దొచుకున్న యువ నాయకుడు అందించే ఓదార్పు కోసం, పాలనలొ స్వర్న యుగం కోసం ఎదురు చూస్తాం. 

Vision 2020 తో visionary గా మొదలై రెండు కళ్ల సిద్ధాంతంతొ vision మొత్తం కోల్పొయిన All free నాయకుడిని మళ్ళీ తీసుకొద్దాం అంటాం. 

మార్పు కోసం అంటూ వోట్లడిగి, మంత్రి పదవికోసం పార్టీని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఇంకో నాయకుడు మారతాడేమో అనే చిరు ఆశతో వుంటాం.  

మాకు ఈ నాయకులు, వాళ్ళ బాబులు, చిన బాబులు తప్ప వేరే దిక్కు లేదు, ఎందుకంటే మాకు అడిగే ధైర్యం లేదు, పౌరుషం లేదు. పోరాడే ఓపిక లేదు.

ఒక తెలుగు జాతిగా వుండే లక్షణం గాని అత్మ గౌరవం గాని లేదు… మావి సిగ్గు లేని బ్రతుకులు …