హోట‌ల్ లో స‌మంత‌, సిద్దూ ర‌చ్చ ర‌చ్చ

ప్రేమ ప‌క్షులు సిద్దార్థ్‌, స‌మంత ఎక్కడ ప‌డితే అక్కడ ద‌ర్శన‌మిస్తున్నారు. ఇద్దరూ చ‌ట్టాప‌ట్టాలేసుకొని జాయింటుగా తిరిగేస్తున్నారు. భార్యాభ‌ర్తల కంటే అన్యోన్యంగా, క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్ ద‌గ్గర…

ప్రేమ ప‌క్షులు సిద్దార్థ్‌, స‌మంత ఎక్కడ ప‌డితే అక్కడ ద‌ర్శన‌మిస్తున్నారు. ఇద్దరూ చ‌ట్టాప‌ట్టాలేసుకొని జాయింటుగా తిరిగేస్తున్నారు. భార్యాభ‌ర్తల కంటే అన్యోన్యంగా, క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్ ద‌గ్గర ఉన్న ఓ హోట‌ల్లో స‌మంత‌, సిద్దూ జంట ద‌ర్శన‌మిచ్చింది. 

అక్కడ సిద్దూకి బాగా కావ‌ల్సిన ఓ నిర్మాత స‌తీస‌మేతంగా వ‌చ్చాడు. రెండు జంట‌లూ ఆ హోటల్‌లో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. స‌మంత‌, సిద్దూలైతే మ‌రీనూ. ఇకఇక‌లు, ప‌క‌ప‌క‌లూ, జోకులూ… సంద‌డంతా మాదే అన్నట్టు ప్రవ‌ర్తించార‌ట‌. టేబుల్స్ ద‌గ్గర గ‌లాటా చేసి, ఉన్న కాసేపూ రచ్చ ర‌చ్చ చేశార‌ట‌. 

వీళ్లేంటి మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నారు…??  అంటూ సిద్దూ అండ్ కోకి స‌ర్వ్ చేస్తున్న బేర‌ర్లూ, ఆ హోట‌ల్ యాజ‌మాన్యం అనుకొందంటే ఇద్దరూ ఎంత‌లా రెచ్చిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తమ్మీద సిద్దూ, స‌మంత‌ల మ‌ధ్య రాపో మ‌రింత పెరిగింద‌న్నమాట‌. వీరిద్దరికీ చెడింద‌ని, విడిపోయార‌ని చెప్పుకొంటున్నవాళ్లు ఇప్పుడేమంటారో మ‌రి..!