అదుర్స్ 2 ఉత్తినే

ఎన్టీఆర్ టైమ్ బాలేదు. అత‌నంటే ప్రాణం పెట్టే వినాయ‌క్‌, రాజ‌మౌళిలు వేరే హీరోల‌తో సినిమాలు తీసే ప‌నిలో ప‌డిపోయారు. ఎన్టీఆర్ అస‌లు సిసలైన స్ట్రెంత్ తెలిసింది వీరిద్దరికే. ఎన్టీఆర్ సాధించిన హిట్ సినిమాలు చూస్తే…

ఎన్టీఆర్ టైమ్ బాలేదు. అత‌నంటే ప్రాణం పెట్టే వినాయ‌క్‌, రాజ‌మౌళిలు వేరే హీరోల‌తో సినిమాలు తీసే ప‌నిలో ప‌డిపోయారు. ఎన్టీఆర్ అస‌లు సిసలైన స్ట్రెంత్ తెలిసింది వీరిద్దరికే. ఎన్టీఆర్ సాధించిన హిట్ సినిమాలు చూస్తే ద‌ర్శకులుగా వినాయ‌క్‌, రాజ‌మౌళిల పేర్లే క‌నిపిస్తాయి.  

వీరిద్దరూ బిజీ అయిపోయి, ఎన్టీఆర్‌తో సినిమా తీసే తీరిక దొర‌కడం లేదు. అందుకే ఈ కాంబినేష‌న్ చూసే అవ‌కాశం ద‌క్కడం లేదు. ఎన్టీఆర్ – వినాయ‌క్ ల క‌ల‌యిక మ‌ళ్లీ సెట్ అవుతుంద‌ని, వీరిద్దరి నుంచి అదుర్స్ 2 వ‌స్తుందనుకొన్నారు. అయితే ఈ సినిమా చూసే అవ‌కాశం లేన‌ట్టే. ఎందుకంటే అదుర్స్ 2 సినిమాకి స‌రైన క‌థ దొర‌కడం లేద‌ట‌. 

చారి పాత్రని కొన‌సాగిస్తూ వినోదం పంచాల‌ని వినాయ‌క్ ఆలోచ‌న‌. అయితే ఎలా చూసినా.. అదుర్స్ 2కి క‌థ త‌యారు కావ‌డం లేద‌ట‌. అన‌వ‌స‌రంగా అదుర్స్ ఇమేజ్ చెడ‌గొట్టిన‌ట్టు అవుతుంద‌ని వినాయ‌క్ భ‌యం. అందుకే అదుర్స్ 2 ఆలోచ‌న ప‌క్కన పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో ఎన్టీఆర్ తో మ‌రో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కాక‌పోతే ఈ సినిమాకీ చాలా స‌మ‌యం పట్టే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే వినాయ‌క్‌, ఎన్టీఆర్‌లు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి.