ధన్ రాజ్ అరెస్టు?

జబర్థస్త్ కార్యక్రమంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుడు ధన్ రాజ్ అరెస్టయ్యాడన్న వార్త షికారు చేస్తోంది. ఓ మసాజ్ పార్లర్ పై పోలీసులు దాడి చేసినపుడు అక్కడ ధన్ రాజ్ అనుకోని రీతిలో…

జబర్థస్త్ కార్యక్రమంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుడు ధన్ రాజ్ అరెస్టయ్యాడన్న వార్త షికారు చేస్తోంది. ఓ మసాజ్ పార్లర్ పై పోలీసులు దాడి చేసినపుడు అక్కడ ధన్ రాజ్ అనుకోని రీతిలో దొరికాడని అంటున్నారు. 

మసాజ్ పార్లర్లలో శృంగార కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసారని వినికిడి. బంజారా హిల్స్ లోని ఈ పార్లర్ కు తాను పెడిక్యూర్, మెనీ క్యూర్ కోసం వెళ్లానని, ఇతర కార్యక్రమాలతో తనకు సంబంధం  లేదని ధన్ రాజ్ పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. నిజాలు ఇంకా తెలియాల్సి వుంది.