వెంకీ అందుకే త‌ప్పుకొన్నాడా?!

కృష్ణవంశీ తెర‌కెక్కించ‌నున్న సినిమా నుంచి వెంక‌టేష్ త‌ప్పుకొన్నాడు. ఆ స్థానంలో శ్రీకాంత్‌ని ఎంచుకొన్నారు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డంలో ముందుండే వెంక‌టేష్ త‌ప్పుకోవ‌డంపై చిత్ర ప‌రిశ్రమ‌లో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకొంటున్నారు.  Advertisement అయితే అస‌లు కార‌ణం మాత్రం…

కృష్ణవంశీ తెర‌కెక్కించ‌నున్న సినిమా నుంచి వెంక‌టేష్ త‌ప్పుకొన్నాడు. ఆ స్థానంలో శ్రీకాంత్‌ని ఎంచుకొన్నారు. మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డంలో ముందుండే వెంక‌టేష్ త‌ప్పుకోవ‌డంపై చిత్ర ప‌రిశ్రమ‌లో ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకొంటున్నారు. 

అయితే అస‌లు కార‌ణం మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కలేదు. క‌థ న‌చ్చక అని కొంద‌రు, కాల్‌షీట్లు స‌ర్దుబాటు కాక అని మ‌రికొంద‌రు మాట్లాడుకొన్నారు. అయితే రెండు రోజులుగా బ‌య‌టికొస్తున్న వార్తల్నిబ‌ట్టి చూస్తే వెంకీ ఆ సినిమా నుంచి ఎందుకు త‌ప్పుకొన్నాడో స్పష్టంగా అర్థమ‌వుతోంది. 

తెర‌పై చ‌ర‌ణ్‌కి బాబాయ్‌గా క‌నిపించ‌డం ఇష్టం లేక‌నే వెంకీ సినిమా నుంచి బ‌య‌టికొచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడే బాబాయ్, అంకుల్ అని పిలిపించుకొంటే  కెరీర్‌ప‌రంగా ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌నీ, కావాలంటే పాత్రని కాస్త త‌గ్గించి చూపెట్టినా ఏమీ అనుకోన‌ని కృష్ణవంశీతో చెప్పాడ‌ట‌. 

కానీ ఆయ‌న మాత్రం తెర‌పై బాబాయ్‌గా క‌నిపించాలని ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. ఆ పాత్రని అన్నగా మార్చడానికి ట్రై చేసినా కుద‌ర‌లేదని తెలిసింది. దీంతో కృష్ణవంశీ ఆ పాత్ర కోసం శ్రీకాంత్‌ని ఎంచుకొన్నాడు. శ్రీకాంత్ మాత్రం ఈ పాత్ర రావ‌డం ప‌ట్ల ల‌క్కీగా ఫీల్ అవుతున్నాడు.​