షాకింగ్.. ఆత్మహత్యకు యత్నించిన లావణ్య

హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్, రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. అర్థరాత్రి తన లాయర్ తో ఛాట్ చేసిన లావణ్య, తను ఈ…

హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్, రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. అర్థరాత్రి తన లాయర్ తో ఛాట్ చేసిన లావణ్య, తను ఈ లోకాన్ని వీడి పోతున్నట్టు మెసేజ్ చేసింది.

పరిస్థితి తీవ్రతను గ్రహించిన లావణ్య లాయర్ వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేశాడు. 10 నిమిషాల్లో స్పందించిన పోలీసులు, లావణ్య ఇంటికి చేరుకున్నారు. ఆమె ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. సమస్యకు ఇది పరిష్కారం కాదంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు. తాజా ఘటనతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది.

తన గురించి పూర్తిగా తెలిసిన మనుషులే తనను తప్పుబట్టారని లాయర్ తో చేసిన ఛాటింగ్ లో వాపోయింది లావణ్య. అదే టైమ్ లో తను ఎవరో కూడా తెలియని వ్యక్తులు తనకు అండగా నిలబడ్డారని పేర్కొంది. రాజ్ తరుణ్ చేతిలే తను దారుణంగా మోసపోయానని, తన చావుకు రాజ్ తరుణ్, అతడి తల్లిదండ్రులే కారణమని లాయర్ కు మెసేజ్ చేసింది. అదే మెసేజీలో తన చావుకు హీరోయన్ మాల్వీ మల్హోత్రా కూడా కారణమని తెలిపింది.

ఈ సందర్భంగా మరోసారి రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ తన మరణాన్ని కోరుకుంటున్నాడని ఆరోపించింది. ప్రతిది ఓ పథకం ప్రకారం జరుగుతోందని, ఈ మైండ్ గేమ్ తో విసిగిపోయానని, దేవుడి దగ్గరకు వెళ్లిపోతానంటూ మెసేజ్ చేసింది. ఆమె ఆత్మహత్యా యత్నాన్ని పోలీసులు ఆపారు.