దిగజారుతున్న అమెరికా పరిస్థితి

అమెరికాకి ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్ అనే కాదు, ప్రపంచానికి పెద్దన్నయ్య అనే టైటిల్ కూడా ఉంది.

అమెరికాకి “ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్” అనే కాదు, ప్రపంచానికి పెద్దన్నయ్య అనే టైటిల్ కూడా ఉంది.

ప్రపంచంలో ఏ మూల ఏ రెండు దేశాలు కొట్టుకుంటున్నా మధ్యలో వెళ్లడం ఆ దేశానికి అలవాటు. దానివల్ల అమెరికా ఖజానాపై భారం పడుతుంది. యుద్ధం మధ్యలో దూరడమంటే యుద్ధం చెయడమే. సైన్యాన్ని పంపడం, ఆయుధాలు దింపడం..ఇవన్నీ అవసరం లేని భారాలే. దానివల్ల దేశంలో స్టాక్ మార్కెట్ షేకవుతుంది, ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. అయినప్పటికీ “పెద్దన్నయ్య” స్టాటస్ కాపాడుకోవాలంటే ఈ పని చేయక తప్పదు. ఇది చెప్పింది ఎవరో కాదు..ఒకప్పటి అమెరికా జాతీయ రక్షణ సలహాదారు కాండోలిజా రైజ్ చెప్పింది.

అందుకే ఇరాక్-కువైట్ యుద్ధంలోనూ, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ యుద్ధంలోనూ అమెరికా తల దూర్చింది. అలాగే ఐసిస్ ని అణచివేయడానికి ఇరాక్, సిరియా వంటి దేశాల్లో దిగి యుద్ధం చేసింది. గతంలో ఇవన్నీ జరిగాయి. అప్పుడు అమెరికా పరిస్థితి బలంగానే ఉంది. అందుకే పరాయి దేశాల యుద్ధాల్లో శాంతిస్థాపన కోసం యుద్ధాలు చేసి కూడా నిలబడింది.

ఇప్పుడు తాజాగా ఇజ్రాయేల్-ఇరాన్ మధ్యలో యుద్ధవాతావరణం నెలకొని ఉంది.

ఇజ్రాయేల్ కి మొదటి నుంచీ అమెరికాతో స్నేహముంది. తమ మీద దాడి చేసారని హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇస్మాయిల్ హనియే ని ఇరాన్ లో అతిధిగా ఉండగా మట్టుబెట్టింది ఇజ్రాయేల్. ఈ విషయాన్ని ఇజ్రాయేల్ అధికారికంగా ధృవీకరించపోయినా అలా హతామార్చేంత శత్రుత్వం ఇజ్రాయేల్ కి తప్ప మరెవరికీ లేదన్నది లోకవిదితం. అతనొక్కడినే కాదు మరో ఇద్దరు హమాస్ నేతల్ని, ఒక హిజ్బొల్లా నేతని కూడా ఇజ్రాయేల్ లేపేసింది. వీళ్లకి మద్దతుగా ఉన్న ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడం, ఇజ్రాయేల్ మీద దాడికి సన్నాహాలు చేయడం జరుగుతోంది.

ఇది కాస్త ముదిరి పెద్దతైతే అమెరికా ఇక్కడకి కూడా దిగితుందా? ఇజ్రాయేల్ కి మద్దతు పేరుతో ఇరాన్ తోటి, దాని సన్నిహిత దేశాలతోటీ యుద్ధం చేస్తుందా? చేస్తే ఏమిటి ?

చేస్తే మాత్రం..అమెరికా ఈ సారి అతలాకుతలం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ధరలు పెరిగిపోయాయి. రిసెషన్ పేరుతో ఉద్యోగాలు ఊడుతున్నాయి. స్టాక్ మార్కెట్ అంత దూకుడుగా లేదు. రానున్న నవంబర్ ఎన్నికల్లో అధ్యక్ష పదవిలోకి ట్రంప్ వస్తాడా లేక కమలా హారిస్ వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఎవరొచ్చినా దేశాన్ని గడ్డు పరిస్థితిలోంచి సత్వరం బయట పారేస్తారన్న నమ్మకమైతే ప్రజలకి, ఇతర దేశాలకి లేదు.

అమెరికా ఒకప్పుడు “ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యునిటీస్”. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కొత్తగా ఉద్యోగాలు పొంది అక్కడ స్థిరపడాలని కోరుకుంటూ చాలామంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. కానీ వాళ్లల్లో అధిక శాతం మంది చదువు అవ్వగానే తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అన్ని ఉద్యోగాలు అక్కడ లేవిప్పుడు.

కనుక ఏ రకంగా అమెరికా గొప్ప ఇప్పుడు? కేవలం డాలర్ విలువ అంతే! ప్రపంచ విపణి డాలర్ మారకంతో ముడిపడి ఉండడం వల్ల అదొక్కటీ బలంగా ఉంది. అది కూడా ఎన్నాళ్లో తెలీదు. ఇప్పటికే చాలా దేశాలు డాలర్ ని పక్కనపెట్టి సొంత దేశపు కరెన్సీతో ట్రేడ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. వాటిల్లో భారత్ కూడా ఉంది. రూపాయిని బలోపేతం చేసే దిశగా డాలర్ని పక్కనపెడుతోంది.

గతంలో అమెరికా శాంక్షన్స్ విధిస్తుంది అంటే దేశాలు భయపడేవి. ఎందుకొచ్చిన గొడవ అన్నట్టుగా అమెరికా మాట వినేవి. ఇప్పుడలా లేదు. చాలా దేశాలు మునుపట్లా అమెరికాకి భయపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

అలాంటి భయమే ఉండుంటే కంటి సైగతో ఉక్రైన్ యుద్ధాన్ని ఆపగలిగేది.

కంటి చూపుతో ఇరాన్-ఇజ్రాయేల్ గొడవని ఈ పాతికే సద్దుమణిగేలా చేసేది.

అలాంటిదేమీ జరగట్లేదంటే అమెరికాకి కూడా తన “పెద్దన్నయ్య” పొజిషన్ ని ప్రపంచం గుర్తించడం లేదని అర్ధమవుతోందా?

బహుశా దిగిపోతున్న తరుణంలో బైడెన్ ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవచ్చు. గెలిచి మొదటి అమెరికా మహిళా అద్యక్షురాలు కావాలనే లక్ష్యంతో కమలా హారిస్ కూడా ప్రపంచ పటం వైపుకు పెద్దగా చూస్తున్నట్టు లేదు. ట్రంప్ పరిస్థితి కూడా అదే. తాను పదవిలోకొస్తే మాత్రం యుద్ధాలు ఆపేస్తానంటున్నాడు. అంటే మరో మూడు నెలల్లో ఎన్నికలు కనుక తనకి కూడా పదవి మీదే దృష్టి.

యుద్ధాలు ఆపలేని పెద్దరికం, పరస్పర ఆరోపణలతో చీప్ గా మారిన రాజకీయం అమెరికా ప్రభను తగ్గిస్తున్నాయి.

ట్రంప్ గెలిస్తే నియంతలా పాలిస్తాడేమో అనే భయాలు అమెరికా మీడియాకి పట్టుకున్నట్టున్నాయి. అందుకే కమలా హారిస్ పేరు ప్రకటించిన వెంటనే గంపగుత్తగా ఆమెను లేపుతున్నాయి. ఒక్క ఫాక్స్ న్యూస్ తప్ప ట్రంప్ పక్షాన ఉన్న బలమైన మీడియా పెద్దగా లేనట్టే ఉంది. ఒక వేళ ప్రజలు మీడియా ప్రభావంలో ఉంటే మాత్రం కమలా హ్యారిస్ కి గెలిస్చే అవకాశాలున్నాయి.

లేదా దేశాన్ని చక్కబెట్టడానికి తమకొక నియంతలాంటివాడే కావాలని ఎక్కువమంది ప్రజలు కోరుకుంటే మాత్రం ట్రంప్ గెలుస్తాడు. తమ ప్రభుత్వ పాలన సరిగా లేదన్న భావన, బలహీనమైన నాయకుల వల్ల దేశం గుల్లవుతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉంటే నియంతలాంటి వాడిని కోరుకోవడం సహజం. కానీ ఆ కోరిక తమకే శాపంగా మారుతుందా లేక మంచి చేస్తుందా అనేది ఆ నియంతృత్వ పోకడని బట్టి ఉంటుంది.

దేశం బాగు కోసం కఠినంగా వ్యవహరించే నేతలూ ఉన్నారు, కేవలం ఇగోతో దేశాన్ని దిగజార్చే నియంతలూ ఉన్నారు.

రెండవ సారి నెగ్గితే ట్రంప్ మొదటి సారిలా ఉంటాడా? లేక పార్ట్-2 లో తనలోని నియంత కోణం చూపిస్తాడా అనేది తెలీదు.

ఎలా చూసుకున్నా అమెరికా ఇప్పుడు సంధికాలంలో ఉంది. మరో నాలుగు నెలల్లో ప్రజల నిర్ణయాన్నిబట్టి ఆ దేశం స్థాయి తెలుస్తుంది. అమెరికా ఎవరి చేతుల్లో పదిలం? ట్రంప్ చేతుల్లోనా లేక కమాలా హారిస్ పాలనలోనా అనేది కూడా అప్పుడే ఏమీ చెప్పలేం. కొన్ని నెలలు వేచి చూడాలి.

పద్మజ అవిర్నేని

13 Replies to “దిగజారుతున్న అమెరికా పరిస్థితి”

  1. పక్కనా వాడి ము*డ్డిలో వేలు పెట్టీ కెలికి ఆ వాసన చూసుకునే అలవాటు ఆపితే అమెరికా కి మంచిది.

    ఇప్పటికీ క్రైస్తవ మత పేరుతో డాలర్ల నిధులు కోసం ఇక్కడి చర్చ్ లో పాస్టర్లు , ఇక్కడి సామాజిక , రాజకీయ అస్థిరత విషయాలు అన్నీ అమెరికా కి చెరవేసి, వాళ్ళు వేసే డాలర్ల ముష్టి తెచ్చుకునే వారు.

    ఆ సమాచారం నీ అమెరికా వాళ్ళు తమికి అనుకూలంగా వాడుకునే వారు.

    ఇప్పుడు ముస్లిం అరబ్బ దేశాల ప్రాబల్యం కూడా పెరిగింది. చైనా, రష్యా కేంద్రిత రాజకీయాల్లో మిగతా దేశాలు అమెరికా మాట వినాల్సిన అవసరం తగ్గింది.

    కాకపోత్తే ఇంకా మన రాహుల్ అమెరికా లో సారెస్ సహాయం తో మరల క్రైస్తవ మాఫియా రాజ్యం నీ తేవాలి అని ట్రై చేస్తున్నాడు.

    1. అప్పటి లో మిషన్ లాజరస్ అనే పేరుతో దక్షిణ భారత దేశం ( ఆంధ్ర, తమిళనాడు, కేరళ ) మొత్తం క్రైస్తవ మతం లో కి మార్చాలి అనే ప్రాజెక్టు అమెరికా cia, వాటికన్ చర్చ్ , ఇక్కడి తమ అనూక్కుల రాజకీయా పార్టీ లతో కలిసి మొదలు పెట్టాయి.

      అందులో కాంగ్రెస్ సోనియా, తమిళ డీఎంకే, కేరళ సీపీఐ , ఆంధ్ర కన్వర్టెడ్ రెడ్డి కులం నాయకులు ఒక ముఠా గా వుండేవారు.

      1. నీగ్రో , mexican లు బ్లు కాలర్ రంగము లన్ని తమ చేతుల్లో తెచ్చుకున్నారు. ఇప్పుడు తెల్ల వాళ్ళకి అన్నిట్లో పోటీ పెరిగి పోయింది.

      2. మరనాత మోజెస్ చౌదరి మన కులపోడు కాబట్టి కనపడలేదా…

        అమరావతి మండలం లో ఎన్ని గ్రామాలు మనవాళ్ళు కిరిస్తాని మతం లో వున్నారు….

        పచ్చ కళ్ళకి కనపడవులే.

  2. Ha! Ha!! LoL!! for last 5 years, GA never wrote like this. Instead it supported Jagan.

    .

    When RRR was beaten black and blue you even ridiculed him, indirectly saying he got what he deserved.

    .

    Even today none of the YCP ex MLA’s or ministers were harassed like Jagan did to TDP/other leaders!

    .

    Look at CBN, Atcham Naidu, Dulipala Narendra kumar, Kuna Ravindra, Kodela Siva Prasad, Ayyanna patrudu, Narayana, JC brothers, Bonda Uma, Pattabi, Subbam Hari, GV Harsha Kumar, AndhraJyothi, Ramoji, journalist Murthy, Venkata Krishana, Dr sudhakar, Ranganayakamma etc. All of them were targeted and harassed.

  3. గత 5 సంవత్సరాలుగా, GA ఎప్పుడూ ఇలా వ్రాయలేదు. పైగా జగన్‌కు మద్దతిచ్చింది.

    .

    RRRని చావ బాదినప్పుడు.. మీరు RRR ని ఎగతాళి చేసారు, పరోక్షంగా ఆ పనిని సమర్దించారు.

    .

    ఈరోజుకీ TDP వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను ఇతర నేతలను వేధించలేదు!

    .

    సిబిఎన్, అచ్చం నాయుడు, దూళిపాళ నరేంద్ర కుమార్, కూన రవీంద్ర, కోడెల శివ ప్రసాద్, అయ్యన్న పాత్రుడు, నారాయణ, జెసి సోదరులు, బోండా ఉమ, పట్టాబి, సుబ్బం హరి, జివి హర్ష కుమార్, ఆంధ్రజ్యోతి, రామోజీ, జర్నలిస్టు మూర్తి, వెంకట కృష్ణ, డాక్టర్ సుధాకర్‌ , రంగనాయకమ్మలను చూడండి. ఎంత గా వెదించారొ తెలుసుంది.

  4. అసలు ప్రపంచానికి పెద్దన్న లాగ, అమెరికా నీ వుండమని ఎవడు అడిగాడు?

    వాడొచ్చి , మన దేశ విషయాల్లో జోక్యం చూసుకోదం ఏమిటి? మనమేమన్న బానిస దేశమా !

  5. చట్టపరంగా దేశంలోకి పౌరులని స్వాగతించి, ప్రపంచ వ్యాప్తంగా తెలివి కలవారిని చేర్చుకొని అమెరికా చాలా రంగాల్లో పురోభివృద్ధి అత్యంత వేగంగా సాధించింది. చట్టాల సౌలభ్యంతో ప్రజలకి సులభ జీవన విధానం అలవాటు చేసింది. (సులభ జీవన విధానం వలన బద్ధకం పెరుగుతుంది).

    1916 దాక అదంతా బాగా జరిగింది…ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధంలో వేలు పెట్టిందో కళ్ళు నెత్తికెక్కడం మొదలయింది. అక్కడికి తన పెత్తనం చూసుకుంటే సరిపోయేది. శరణార్ధుల పేరుతో అవసరం కోసం ఎంతోమంది రాక్షసులని చేరదీశారు. ప్రపంచ యుద్ధాల్లో నేరాలు చేసిన చాలామంది అమెరికాలో తల దాచుకున్నారు. యూకే తోబాటు ఫ్రాన్స్ లాంటి యూరోప్ దేశాలు చాలా ఇలాగే చేసారు.

    రష్యా తో స్నేహం వలన అనే వంకతో భరత్ ని పక్కనపెడుతూ, భరత్ శత్రువులని చేరదీశారు. మొన్న పారిస్ ఒలింపిక్స్ లో, నేను యూకే లో ఏమి జరుగుతుందో చూస్తున్నాము. రేపు అమెరికాలో కూడా అంతే.

  6. జూలైలో ఉపాధి రేటు 4.3%కి పెరగడంతో US ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించి దొబ్బింది .

Comments are closed.