ఉగాది హామీ… వ‌లంటీర్ల‌కు చేదు జ్ఞాప‌క‌మే!

ఉగాది ప‌ర్వ‌దినం నాడు వ‌లంటీర్ల‌కు చంద్ర‌బాబు శుభ‌వార్త చెప్పారు. తాము అధికారంలోకి వ‌స్తే ఇప్పుడిస్తున్న రూ.5 వేల గౌర‌వ వేత‌నాన్ని రెట్టింపు చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. దీంతో వ‌లంటీర్ల‌కు ఆశ పుట్టింది. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మిని…

ఉగాది ప‌ర్వ‌దినం నాడు వ‌లంటీర్ల‌కు చంద్ర‌బాబు శుభ‌వార్త చెప్పారు. తాము అధికారంలోకి వ‌స్తే ఇప్పుడిస్తున్న రూ.5 వేల గౌర‌వ వేత‌నాన్ని రెట్టింపు చేస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. దీంతో వ‌లంటీర్ల‌కు ఆశ పుట్టింది. చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మిని అధికారంలోకి తెచ్చుకుంటే నెల‌నెలా రూ.10 వేలు పొందొచ్చ‌ని. ఆశ చెడ్డ‌దంటారు. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. ఉగాది ప‌ర్వ‌దినం నాడు బాబు ఇచ్చిన హామీ వ‌లంటీర్ల‌కు చేదు జ్ఞాప‌కంగా మిగిలే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

అయితే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై ఇంకా అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. కానీ కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌తి అడుతూ వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై నీలి మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. తాజాగా వ‌లంటీర్ల వాట్సాప్ గ్రూప్‌ల‌ను తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల డైరెక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ కీల‌క ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తార‌న్న ప్ర‌చారానికి ఈ ఆదేశాలు బ‌లం క‌లిగిస్తున్నాయి.

చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి చేసుకుంటే రూ.10 వేలు వ‌స్తుంద‌ని ఆశ‌ప‌డ్డ వారికి ఈ ప‌రిణామం షాక్ ఇస్తోంది. మ‌రో ఎన్నిక‌ల హామీకి మంగ‌ళం ప‌ల‌కిన‌ట్టే అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డం, ఇటీవ‌ల కాలంలో వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలంటూ స‌ర్పంచుల సంఘం తీర్మానం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని భావించే ప‌నుల్ని కూట‌మి స‌ర్కార్ ఇత‌రుల చేతుల మీదుగా చేయించ‌డంలో సిద్ధ‌హ‌స్తురాలు.

వ‌లంటీర్ల విష‌యంలో త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా, స్వ‌స్తి చెప్పాల‌ని అనుకుంటోంది. అయితే ఎన్నిక‌ల హామీగా రూ.10 వేలు ఇస్తామ‌ని చెప్ప‌డాన్ని వ‌లంటీర్లు మరిచిపోరు. వైసీపీ నియ‌మించిన వ‌లంటీర్ల‌ని స‌రిపెట్టుకుంటే, కూట‌మి స‌ర్కార్‌ను చేయ‌గ‌లిగేదేమీ లేదు.

10 Replies to “ఉగాది హామీ… వ‌లంటీర్ల‌కు చేదు జ్ఞాప‌క‌మే!”

  1. …వాలంటీర్ వ్యవస్థ మంచిదా కాదా / ఉండాలా/ ఉంచాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయమే కానీ ఎన్నికలప్పుడు ఒక హామీ ఇచ్చి తర్వాత వేరేలా వ్యవహరించడం సమర్ధనీయం కాదు…ఒకవేళ ఆ వ్యవస్థ అవసరం లేదనుకుంటే ఎన్నికలకు ముందే రద్దు చేస్తామని క్లియర్ గా తమ వైఖరిని చెప్పి దానికి తగిన జస్టిఫికేషన్ ఇచ్చి ఉండాల్సింది… ఇది ఏ పార్టీ కైనా వర్తిస్తుంది…

  2. 5 సంవత్సరాలకు కాంట్రాక్టు పద్దతిలో వాలంటీర్లను నియమించుకోవడం మంచిది కొత్త ప్రభుత్వం తిరిగి వాళ్లకు కావలసిన వాళ్ళను నియమించుకునే అవకాశం ఉంటుంది దీని వలన ప్రభుత్వాలు వాళ్ళు కోరుకొన్న విధంగా ఓటర్ లతో సంబంధాలు కలిగి వుంటారు ప్రభుత్వం పొతే వాళ్ళు పోవాలి

  3. ఒక ఎలిజిబిటీ , ఒక పద్ధతి లేకుండా,

    మన కార్యకర్తలనే వాలంటీర్లు చేసాం,వాళ్లంతా మేము పెట్టిన మనుషులే అని ఒకటికి వందసార్లు చెప్పారు.అందుకే వాళ్ళని ఇప్పుడు ఒక పార్టీ మనుషుల్లానే చూస్తున్నారు.మీరెందుకు అలా చెప్పారు?

Comments are closed.