భార్యాభర్తలు కాబోతున్న నాగచైతన్య-శోభిత

హీరో నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయ్యాడు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో అతడికి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు చైతూ-శోభిత నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది. Advertisement నాగచైతన్య,…

హీరో నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయ్యాడు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో అతడికి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు చైతూ-శోభిత నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది.

నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగినట్టు స్వయంగా నాగార్జున ప్రకటించారు. శోభితను సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొడుకు, కాబోయే కోడలితో దిగిన ఫొటోను రిలీజ్ చేశారు.

నాగచైతన్య, శోభిత ప్రేమించుకుంటున్నారంటూ కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. తొలిసారి విదేశాల్లో ఓ రెస్టారెంట్ లో దిగిన ఫొటోతో వీళ్లిద్దరి వ్యవహారం బయటకొచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసే ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.

అయితే ఎప్పటికప్పుడు తమ డేటింగ్ మేటర్ ను ఈ జంట ఖండిస్తూ వచ్చింది. అయితే ఆ పుకార్లే నిజమయ్యాయి. ఈరోజు నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీళ్ల పెళ్లి వేడుక ఉంటుంది.

37 ఏళ్ల నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి. ఇంతకుముందు అతడు హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అలా సమంత నుంచి అధికారికంగా విడిపోయిన నాగచైతన్య, శోభితకు దగ్గరయ్యాడు.

14 Replies to “భార్యాభర్తలు కాబోతున్న నాగచైతన్య-శోభిత”

  1. అల్ ది బెస్ట్ .మనిషి మంచోడే అయినా.. సమంతనీ దెం .. లేని వాడు శోభితాని ఎన్నాళ్లు ఆపగలడు

Comments are closed.