అనుకూల ప్ర‌భుత్వం.. సునీత దూకుడు

అనుకూల ప్ర‌భుత్వం వ‌చ్చింద‌ని వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం త‌న తండ్రి హ‌త్య కేసు నిందితుల‌కు అండ‌గా నిలిచింద‌నేది ఆమె ప్ర‌ధాన ఆరోప‌ణ‌. క‌నీసం ఇప్పుడైనా…

అనుకూల ప్ర‌భుత్వం వ‌చ్చింద‌ని వైఎస్ వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం త‌న తండ్రి హ‌త్య కేసు నిందితుల‌కు అండ‌గా నిలిచింద‌నేది ఆమె ప్ర‌ధాన ఆరోప‌ణ‌. క‌నీసం ఇప్పుడైనా వివేకా కేసును ముందుకు తీసుకెళ్లాల‌ని ఆమె ఆత్రుత ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అలాగే గ‌తంలో కేసును ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి ప్ర‌య‌త్నించిన పోలీసుల‌పై ఎలాగైనా వేటు వేయించాల‌నేది ఆమె వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ను సునీత క‌లుసుకున్నారు. త‌న తండ్రి కేసులో నిందితుల‌ను సీబీఐ అరెస్ట్ చేసేందుకు స‌హ‌క‌రించాల్సిందిగా సునీత కోర‌డం గ‌మ‌నార్హం. తాజాగా క‌డ‌ప ఎస్పీ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రాజును కూడా ఆమె క‌లుసుకున్నారు. వివేకా హ‌త్య కేసుపై ఎస్పీతో చ‌ర్చించారు.

గ‌త ప్ర‌భుత్వంలో సీబీఐకి, బాధితులైన త‌మ‌కు పోలీసులు స‌హ‌క‌రించలేద‌ని ఎస్పీకి సునీత ఫిర్యాదు చేశారు. నిందితుల‌తో అంట‌కాగిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. వివేకా హ‌త్య కేసులో సునీత‌తో చంద్ర‌బాబు స‌ర్కార్ వ్యూహాత్మ‌కంగా ఫిర్యాదులు చేయిస్తోంద‌ని వైసీపీ నేత‌లు అనుమానిస్తున్నారు.

ముఖ్యంగా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయించాల‌ని సునీత ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అవినాష్ బెయిల్ ర‌ద్దు చేయించేందుకు ఆమె న్యాయ పోరాటం చేస్తున్న‌ప్ప‌టికీ నిరాశే మిగిలింది. ఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయించొచ్చ‌ని ఆమె భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె అదే ప‌నిలో ఉన్నారు.

19 Replies to “అనుకూల ప్ర‌భుత్వం.. సునీత దూకుడు”

  1. కోడి తలకాయి కన్నా హీనంగా నరికారు పాపం సునీత గారి తండ్రిని, ఐయినా తన అన్న న్యాయం చెయ్యక పోగా ఈ హత్యకు సానుభూతి అస్సలు కనుబరచ లేదు వైసిపి వాళ్ళు. అంటే హింసకు ఒక కొత్త నిర్వచనం, ఇది ఎంత అన్నట్టు చూపించాడు జగన్. రాష్ట్రం ఎటు పోతోందో అర్థం కావట్లేదు, ఇటు వంటి నాయకుల మూలంగా.

  2. ఇదంతా జగన్ రెడ్డి డబ్బు కక్కుర్తి వల్లే వచ్చిన నష్టం..

    నారాసురరక్తచరిత్ర అని చెప్పి.. అధికారం లోకి వచ్చాక.. చంద్రబాబు దగ్గర డబ్బు కి అమ్ముడుపోయి.. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని .. చంద్రబాబు చేసిన హత్య ని గుండెపోటుగా , ఫ్యాక్షన్ హత్య గా మార్చాలని చూసాడు..

    ఇప్పుడు చంద్రబాబు సేఫ్.. జగన్ రెడ్డి.. జగన్ రెడ్డి జనాలు ఇరుక్కుపోయారు..

    డబ్బు యావ ఉండొచ్చు గాని.. మరీ ఇంట్లో శవాల మీద పేలాలు ఏరుకొనేలా ఉండకూడదు..

  3. ఇదంతా జగన్ రెడ్డి డబ్బు కక్కుర్తి వల్లే వచ్చిన నష్టం..

    నారాసురరక్తచరిత్ర అని చెప్పి.. అధికారం లోకి వచ్చాక.. చంద్రబాబు దగ్గర డబ్బు కి అమ్ముడుపోయి.. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని .. చంద్రబాబు చేసిన హత్య ని గుండెపోటుగా , ఫ్యాక్షన్ హత్య గా మార్చాలని చూసాడు..

    ఇప్పుడు చంద్రబాబు సేఫ్.. జగన్ రెడ్డి.. జగన్ రెడ్డి జనాలు ఇరుక్కుపోయారు..

    డబ్బు యావ ఉండొచ్చు గాని.. మరీ ఇంట్లో శ వా ల మీద పేలాలు ఏరుకొనేలా ఉండకూడదు..

    1.  చంద్రబాబు దగ్గర డబ్బు కి అమ్ముడుపోయి.. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దని .. చంద్రబాబు చేసిన హత్య ని గుండెపోటుగా , ఫ్యాక్షన్ హత్య గా మార్చాలని చూసాడు.. ?????

      1. మీరు అక్కడ “వెటకారం” అర్థం చేసుకోవాలి..

        చంద్రబాబే చంపేశాడని వాగిన నోర్లకి ఈ “వెటకారం” ఎక్కడో కారం రాసినట్టుంటుంది..

      1. బాబాయ్ చనిపోయాక శవాన్ని ముందు పెట్టుకుని.. చంద్రబాబే చంపించాడు అని జగన్ రెడ్డి చెప్పాడా లేదా..?

        మరుసటి రోజు.. సాక్షి లో .. నారాసురరక్తచరిత్ర అని రాశారా లేదా..?

        అంటే.. వివేకా ని చంద్రబాబే చంపాడని జగన్ రెడ్డి నమ్ముతున్నాడు..

        మరి అధికారం లోకి వచ్చాక సిబిఐ విచారణ వద్దని ఎందుకు పిటిషన్ వేసాడు..

        అంటే.. దానికి 3 కారణాలు ఉండొచ్చు..

        మొదటిది..నారాసురరక్తచరిత్ర అని అబద్ధం చెప్పి రాజకీయం గా వాడుకుని ఉండొచ్చు..

        రెండవది ..చంద్రబాబు అంటే జగన్ రెడ్డి కి భయం అయి ఉండొచ్చు..

        మూడవది…చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని జగన్ రెడ్డి అమ్ముడు పోయి ఉండొచ్చు..

        మీరే చెప్పండి.. సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నాడో.. మీరే చెప్పండి..

      2. నేను కింద అడిగిన ప్రశ్న కి సమాధానం లేదా సారూ..?

        మీరు ప్రశ్న అడిగేటప్పుడు ఉన్నంత ధైర్యం.. సమాధానం చేసేటప్పుడు కూడా ఉండాలి..

  4. దీన్ని…అనుకూల ప్రభుత్వం…బొంగు బోషాణం అనకూడదు…న్యాయం కోసం పోరాటం అనాలిరా ఎర్రినాయాల

Comments are closed.