కాంగ్రెస్ సీఎంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడిప్పుడే ప‌రిపాల‌న బాట‌లో న‌డుస్తున్నారు. పాల‌నా విధానాల్ని అర్థం చేసుకోడానికి అధ్య‌యనం చేస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడిప్పుడే ప‌రిపాల‌న బాట‌లో న‌డుస్తున్నారు. పాల‌నా విధానాల్ని అర్థం చేసుకోడానికి అధ్య‌యనం చేస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. సినీ రంగం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప‌రిపాల‌నా విధానాల‌పై అవ‌గాహ‌న లేదు. ఇంత‌కాలం ప్ర‌తిప‌క్ష పాత్ర‌లో ఉండ‌డంతో ఏదో ఒక‌టి మాట్లాడుతూ కాలం గ‌డుపుతూ వ‌చ్చారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంలో కూట‌మి ఏర్పాటులో ప‌వ‌న్ కీల‌క పాత్ర పోషించారు. టీడీపీని కూట‌మిలోకి తీసుకొచ్చేందుకు తాను చీవాట్లు తినాల్సి వ‌చ్చింద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఏది ఏమైతేనేం కూట‌మి అధికారంలోకి రావ‌డం, త‌న‌కిష్ట‌మైన అట‌వీశాఖ‌, గ్రామీణాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణశాఖ‌ల బాధ్య‌త‌ల్ని తీసుకున్నారు.

జ‌న‌సేన ఆశ‌యాల్లో ప‌ర్యావ‌ర‌ణం, అట‌వీ సంర‌క్ష‌ణ ప్ర‌ధాన‌మ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మొద‌టిసారిగా అధికారికంగా క‌ర్నాట‌క రాష్ట్రానికి వెళ్ల‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇందులో భాగంగా ఆయ‌న క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌తో బెంగ‌ళూరులో భేటీ అయ్యారు.

ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్ట‌డంలో భాగంగా పొరుగు రాష్ట్రాల స‌హ‌కారాన్ని ఆయ‌న తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర అట‌వీశాఖ మంత్రితో చ‌ర్చించ‌నున్నారు. మొద‌ట సీఎంతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా భేటీ అయిన‌ట్టు జ‌న‌సేన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇదిలా వుండ‌గా చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో పొలాల్లోకి వ‌చ్చే ఏనుగుల మంద‌ను త‌రిమి కొట్టేందుకు ఆరు కుంకీల ఏనుగుల్ని ఇవ్వాల‌ని క‌ర్నాట‌క‌ను ఆయ‌న కోర‌నున్నారు.

10 Replies to “కాంగ్రెస్ సీఎంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భేటీ”

  1. ఒరేయ్ జగన్ రెడ్డి.. నాకెందుకో డౌట్ కొడుతోంది..

    నీకు బెంగుళూరు లో కూడా నిలువ నీడ లేకుండా చేసేయడానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నట్టున్నాడు..

    నీకు ఇప్పుడు రెండే దార్లు..

    యెలహంక పాలస్ నుండి సొరంగం తవ్వుకుని.. అండమాన్ జైలు కి వెళ్ళిపో..

    లేదంటే..

    తప్పైపోయిందని.. కొవ్వెక్కి, దూలెక్కి చెత్త వాగుడు వాగానని ప్రెస్ మీట్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పు..

    పేపర్ లో రాసుకొస్తే.. ఒప్పుకోరు.. నిజాయితీగా నీ తప్పులు ఒప్పుకుని.. బతికిపో..

    1. ఇక్కడ రాసిన ఆర్టికల్ ఏమిటి- నీ కామెంట్ ఏమిటి? పగ, ద్వేషము నీకు చాలా ఎక్కువగా ఉందే?

Comments are closed.