ఆ కృష్ణుడే అవార్డు తెచ్చిపెట్టాడు

70వ నేషనల్ ఫిలిం అవార్డుల్లో కార్తికేయ-2 మెరిసింది. దేశవ్యాప్తంగా హిట్టయిన ఈ సినిమాను జ్యూరీ గుర్తించింది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ-2కు అవార్డ్ ప్రకటించింది. దీంతో యూనిట్ అంతా సంబరాలు చేసుకుంటోంది. Advertisement…

70వ నేషనల్ ఫిలిం అవార్డుల్లో కార్తికేయ-2 మెరిసింది. దేశవ్యాప్తంగా హిట్టయిన ఈ సినిమాను జ్యూరీ గుర్తించింది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ-2కు అవార్డ్ ప్రకటించింది. దీంతో యూనిట్ అంతా సంబరాలు చేసుకుంటోంది.

కార్తికేయ-2 సినిమాలో కృష్ణ తత్వం గురించి చర్చించారు. ఫాంటసీ అంశాల్ని స్పృశిస్తూనే, మంచి సందేశాన్నిచ్చారు. ఆ కృష్ణుడి దయ వల్లనే సినిమా దేశవ్యాప్తంగా హిట్టయిందని, ఇప్పుడు అదే కృష్ణుడి కృపతో తమ సినిమాకు జాతీయ అవార్డ్ వచ్చిందని అన్నాడు హీరో నిఖిల్. దాదాపు ఇదే అభిప్రాయాన్ని దర్శకుడు చందు మొండేటి కూడా వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా కార్తికేయ-3 హీరో-దర్శకుడు స్పందించారు. ప్రస్తుతం పార్ట్-3కి సంబంధించి కథా చర్చలు సాగుతున్నాయని, తండేల్ తర్వాత కార్తికేయ-3నే ఉంటుందని చందు మొండేటి ప్రకటించాడు. అటు నిఖిల్ కూడా కార్తికేయ-3 తన కెరీర్ లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.

జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఆట్టమ్ అనే మలయాళ చిత్రం నిలిచింది. ఇక ఉత్తమ నటుడిగా కాంతార చిత్రంలో నటించిన రిషబ్ శెట్టి ఎంపికవ్వగా.. ఉత్తమ నటిగా నిత్యామీనన్ (తిరు చిత్రంబళం-తమిళ్) నిలిచింది. కన్నడలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేజీఎఫ్-2, తమిళ్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పీఎస్-1 నిలిచాయి.

8 Replies to “ఆ కృష్ణుడే అవార్డు తెచ్చిపెట్టాడు”

Comments are closed.