ప‌వ‌న్ కోసం సీఐడీకి సుగాలి ప్రీతి కేసు

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే ప్ర‌స్తావించిన అంశం… సుగాలి ప్రీతి కేసు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం ప్ర‌స్తుతం ఆ కేసును సీఐడీకి అప్ప‌గించ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కార్ సిద్ధ‌మైంది. ఆశ్చ‌ర్యం ఏమంటే గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో 2017లో…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే ప్ర‌స్తావించిన అంశం… సుగాలి ప్రీతి కేసు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం ప్ర‌స్తుతం ఆ కేసును సీఐడీకి అప్ప‌గించ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కార్ సిద్ధ‌మైంది. ఆశ్చ‌ర్యం ఏమంటే గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న‌లో 2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి చెందింది. అప్పుడేమీ తేల్చ‌లేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం కూడా సుగాలి ప్రీతి కేసులో బాధితుల‌కు న్యాయం చేయ‌లేదు.

మ‌ళ్లీ ఇప్పుడు అధికారంలో చంద్ర‌బాబు ఉన్నారు. బాధితులు మ‌రోసారి చంద్ర‌బాబు స‌ర్కార్‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. సుగాలి ప్రీతి త‌ల్లి పార్వ‌తి స‌చివాల‌యంలో హోంశాఖ మంత్రి అనిత‌ను క‌లిశారు. కేసును సీఐడీకి అప్ప‌గిస్తున్న‌ట్టు అనిత చెప్పార‌ని పార్వ‌తి మీడియాకు వెల్ల‌డించడం గ‌మ‌నార్హం.

క‌నీసం ఇప్పుడైనా బాధిత కుటుంబానికి న్యాయం జ‌రగాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయంగా సుగాలి ప్రీతి కేసును వాడుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు అధికారంలో భాగ‌స్వామి. సుగాలి ప్రీతి కేసులో నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ చొర‌వ చూపాల్సిన అవ‌స‌రం వుంది.

లేదంటే ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా దోషిగా నిల‌బ‌డ‌క త‌ప్ప‌దు. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు అధికారంలో వున్న త‌ర్వాత కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోక‌పోతే అభాసుపాలు కావ‌డం ఖాయం. మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం చేస్తారో చూడాలి.

11 Replies to “ప‌వ‌న్ కోసం సీఐడీకి సుగాలి ప్రీతి కేసు”

  1. Reminding of dogs barking 6 months after theft. Also, CBN in the past had alleged that CID is behaving as stooges to party in power. If tha tis true, what justice can be expected out of this? If government is really serious about giving justice, they should assign this case to CID under the supervision of a retired judge.

  2. If governemnt is really serious about giving justice to Preethi’s family, they need to assign this case to CID under the supervision of retired high court judge. This will ensure CID is not acting under direction of the political party running the government.

  3. అలాగే మీసాలయాన్ మరణం మీద ఆయన భార్య గారికి కి వున్న కు*ట్ర అను*మానం మీద కూడా సీఐ*డీ కి ఇస్తే, దాన్ని ప్లా*న్ చేసిన కొడిక*త్తి డ్రా*మా ఇం*టి దొం*గ ఎవరో కూడా బయట పడతాయి. మీసాలాయ న నిజమైన అభిమానులు సంతోష పడతారు.

  4. ఏంటి, గతంలో సుగాలి ప్రీతీ కేసును పవన్ రాజకీయంగా వాడుకున్నాడా; ఇంకా పవన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నాడా?

  5. మీఈసలయాన్ పైకి వెళ్ళడం లో ప్యాలస్ పులకేశి తో పాటు గ్రేట్ ఆంధ్ర కూడా వాటా వున్నట్లు వింది. మీసలయన మరణం గురించి అడుగుతుంటే , టక్కున డిలీట్ చేస్తున్నాడు. ఎందుకీ భయం, ప్యాలస్ పులకేశి గారు పేరు బయట పడతాయి అనా

  6. రాజకీయంగా సుగాలి కేసు ని వాడుకున్న పవన్ కళ్యాణ్..”?

    ఒక కేసు ని పదే పదే ప్రస్తావించి బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేయడం ‘రాజకీయంగా వాడుకోవడ’మా? ఎన్నాళ్ళకీ బాగుపడవా బ్రదర్?

Comments are closed.