బాబు పాల‌న‌పై వైసీపీ డేగ‌క‌న్ను

చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌పై వైసీపీ డేగ క‌న్ను వేసింది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి 70 రోజులు మాత్ర‌మే కావ‌డంతో, కుదురుకోడానికి ఇంకా కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఆరు నెల‌లు గ‌డిస్తే త‌ప్ప‌, అన్నీ ఒక…

చంద్ర‌బాబు స‌ర్కార్ పాల‌న‌పై వైసీపీ డేగ క‌న్ను వేసింది. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి 70 రోజులు మాత్ర‌మే కావ‌డంతో, కుదురుకోడానికి ఇంకా కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఆరు నెల‌లు గ‌డిస్తే త‌ప్ప‌, అన్నీ ఒక గాడిలో ప‌డే అవ‌కాశం వుండ‌దు. అంత వ‌ర‌కూ పాల‌నారీతులు ఎలా వుంటాయో తెలిసే అవ‌కాశం వుండ‌దు. క‌నీసం ఒక ఏడాది స‌మ‌యం చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇచ్చే ఆలోచన‌లో వైసీపీ వుంది.

ఇదే విష‌యాన్ని వైసీపీ నేత‌ల స‌మావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఏవైనా ప్ర‌మాదాలు, వైసీపీ నేత‌ల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌రిగిన సంద‌ర్భాల్లో జ‌గ‌న్ బ‌య‌టికొచ్చి మొక్కుబ‌డిగా సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల అమ‌లు గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. ఇంత‌కు మించి ఆయ‌న ఘాటుగా రియాక్ట్ కాలేదు. ఆ అవ‌స‌రం కూడా ఇప్ప‌ట్లో లేద‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు.

ఈ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌పై ఎలాంటి వైఖ‌రితో ముందుకెళుతుందో తెలుసుకోవాల‌నే ఆస‌క్తితో వైసీపీ నేత‌లు ఎదురు చూస్తున్నారు. అందుకే ప్ర‌తిదీ జాగ్ర‌త్త‌గా ఆ పార్టీ నేత‌లు గ‌మ‌నిస్తున్నారు. ఇప్ప‌ట్లో చంద్ర‌బాబు స‌ర్కార్ తీరుపై పోరాటాలు చేసే అవ‌స‌రం కూడా ఉద్దేశంతో వైసీపీ నేత‌లు సొంత ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అందుకే వాళ్ల‌కు సంబంధించిన వార్త‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

కూట‌మి నేత‌ల త‌ప్పుల్ని మాత్రం లెక్క క‌డుతున్నారు. అవి ఇంకా పెరిగిన త‌ర్వాత మాట్లాడొచ్చ‌నే ఉద్దేశంతో వైసీపీ నేత‌లున్నారు. వైసీపీ కోరుకున్న‌ట్టుగానే కూట‌మి నేత‌లు త‌ప్పులు చేస్తున్నారు. అయితే వాటిపై ప్ర‌జావ్య‌తిరేక‌త వ‌చ్చే వ‌ర‌కూ వైసీపీ నేత‌లు ఎదురు చూడ‌నున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీగా రాజ‌కీయ కోణంలో ఆలోచించిన‌ప్పుడు ఇదే స‌రైందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

9 Replies to “బాబు పాల‌న‌పై వైసీపీ డేగ‌క‌న్ను”

  1. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల అభిమానాన్ని గెలుచుకుని ఎలక్షన్లో గెలుద్దాం అని లేదు.

  2. పవన్ బాబు లొకెష్ DIRECT M U R D E R లు r a p e చెస్తె తప్పా వాళ్ళు ఒడిపొరు ..

    .జగన్ గెలవడు…no future for jagan

  3. ఇంకా పధకాలు మత్తు వొదలలేదు … మనం అన్ని పధకాలు ఇచ్చి ఎందుకు ఓడిపోయామో అని ఆలోచన కూడా లేదు .. ఇంకా పథకాలు .. ఈవ్-ములు అంటూ కాలక్షేపం చేస్తున్నారు ..

Comments are closed.