వైసీపీని వీడ‌నున్న మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు!

వైసీపీకి వ‌రుస షాక్‌లు త‌ప్ప‌డం లేదు. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీలో వుండ‌డానికి కొంద‌రు నాయ‌కులు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి…

వైసీపీకి వ‌రుస షాక్‌లు త‌ప్ప‌డం లేదు. అధికారాన్ని కోల్పోయిన ఆ పార్టీలో వుండ‌డానికి కొంద‌రు నాయ‌కులు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి పార్టీని వీడ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు పార్టీని వీడ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నార‌ని తెలిసింది. వీరిలో రాజ్య‌స‌భ స‌భ్యుడు బీద మ‌స్తాన్‌రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. వీళ్లిద్ద‌రు కూడా గ‌తంలో టీడీపీలో ఉన్నారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో వైసీపీలో చేరారు. వాళ్లిద్ద‌రికీ వైసీపీలో ప్రాధాన్యం ద‌క్కింది. పోతుల సునీత వైసీపీ మ‌హిళా అధ్య‌క్షురాలిగా కూడా ప‌ని చేశారు.

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చొర‌వ‌తో బీద మ‌స్తాన్‌రావును వైసీపీలో చేర్చుకోవ‌డంతో పాటు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కూడా ద‌క్కింది. కానీ వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో వ్యాపార‌వేత్త అయిన బీద మ‌స్తాన్‌రావు ఆ పార్టీలో అసౌక‌ర్యంగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న టీడీపీతో ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలిసింది.

మోపిదేవితో పాటు బీద మ‌స్తాన్‌రావు కూడా టీడీపీలో చేరే అవ‌కాశం వుంది. పోతుల సునీత కూడా టీడీపీలో చేర‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన సునీత వైసీపీలో కీల‌కంగా ప‌ని చేశారు. ఆమె పార్టీని వీడుతార‌నే స‌మాచారం వైసీపీకి జీర్ణం చేసుకోలేనిదే.

26 Replies to “వైసీపీని వీడ‌నున్న మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు!”

  1. Wish these Turn coats atleast quit the mlc mp before they leave party throgh which they got..ఇది అత్యాసే కావచ్చు. నైతిక విలువలు ఎక్కడ వున్నాయి. Babu should learn from this episode and not to entertain these crooks who can not live without power and give posts to those who are with him and in party when in opposition

  2. డక్కా మొక్కీలు తిన్న జగన్ ఎలాగోలా తట్టుకుంటాడు , పాపం ఎంకటి పరిస్థితి ఏంటో 

  3. మా తెలుగు మీడియా మమ్మలను ఎలా ట్యూన్ చేసుకుంటుంది అంటే, బాబు గారు ఏది చేసిన లోక కళ్యాణం కోసం చేసినట్లే అన్న విధంగా. మా రాష్ట్రము లో ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీ + 4 MP ల కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ ఐనది.

    BJP తొందరగా మేలుకొని మిగిలిన వారిని విలీనం చేసుకోకపోతే BJP కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బాబు గారి మీడియా స్లీపర్ సెల్స్ తమ ప్రత్యర్థుల మీద సైకలాజికల్ వార్ చేస్తూ ఒక్కొక పార్టీ ని/వ్యక్తిని నిర్వీయం చేస్తూ ముందుకు వెళ్తుంది ,

    ఆంధ్ర లో ఉన్న వాళ్ళను టీడీపీ లోకి , తెలంగాణా లో ఉన్న వాళ్ళను కాంగ్రెస్ లోకి వెళ్లిపోయేటట్లు చేస్తూ , ప్రజల నుంచి కూడా దీనికి acceptance ఉన్నట్లు సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు,

    ఫైనల్ టార్గెట్ దేశంలో ఎక్కువ ఎంపీ లు ఉన్న ప్రాంతీయ పార్టీ గా ఎదగడం అప్పుడు తన చక్రాన్ని బయటకు తీసి Vajpayee ని బెదిరించి నట్లు బెదిరించే విధం గా సెట్ చేసుకోవడం. BJP తొందరగా వాళ్ళకు అనుకూలం గా మార్చుకోకపోతే Vajpayee గారి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది మళ్ళి.

Comments are closed.