ఎన్టీఆర్ కోసం హృతిక్ ప్రచారం?

కొత్త సినిమా రిలీజ్ పెట్టుకున్నోళ్లు ఎవరైనా తమ పరిచయాలన్నింటినీ బయటకు తీస్తారు. తమ సినిమాకు మ్యాగ్జిమమ్ ప్రచారం కల్పించాలని చూస్తారు. మొన్నటికి మొన్న తన చిన్న సినిమా కోసం నిహారిక, ఏ రేంజ్ లో…

కొత్త సినిమా రిలీజ్ పెట్టుకున్నోళ్లు ఎవరైనా తమ పరిచయాలన్నింటినీ బయటకు తీస్తారు. తమ సినిమాకు మ్యాగ్జిమమ్ ప్రచారం కల్పించాలని చూస్తారు. మొన్నటికి మొన్న తన చిన్న సినిమా కోసం నిహారిక, ఏ రేంజ్ లో తన పరిచయాల్ని వాడిందో అందరం చూశాం. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నాడు.

దేవర సినిమాను బాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో, దేవర-1తో తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు తారక్. దీని కోసం బాలీవుడ్ లో తన పరిచయాలన్నింటినీ వాడే ప్రయత్నం చేస్తున్నాడు.

కరణ్ జోహార్, అలియా భట్, సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్-హృతిక్ కలిసి వార్-2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సో.. ఎన్టీఆర్ అడిగితే, అతడి కోసం హృతిక్ రోషన్ కచ్చితంగా ప్రచారానికి వస్తాడు. ఎటొచ్చి ఎన్టీఆర్ అడుగుతాడా అడగడా అనేది ప్రశ్న.

ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబయిలోనే ఉన్నాడు. దేవర-1 సినిమా కోసం బాలీవుడ్ లో కొన్ని ఛానెళ్లకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్ కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. హృతిక్ ఎంట్రీపై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత రాలేదు.

27న థియేటర్లలోకి వస్తోంది దేవర చిత్రం. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ను అలానే కొనసాగించాలంటే, బాలీవుడ్ లో దేవర-1 తో ఎన్టీఆర్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. అందుకే ఇలా పరిచయాల్ని బయటకుతీసే పని పెట్టుకున్నాడనిపిస్తోంది.

5 Replies to “ఎన్టీఆర్ కోసం హృతిక్ ప్రచారం?”

  1. నీకు నయా పైసా కూడా ఇవ్వక్కర్లేదు… నువ్వు వద్దన్నా కూడా సినిమాని ఎలాగూ లేపుతావ్ కాబట్టి

  2. జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రెడీ అడిగాడు.. కానీ హృతిక్ సున్నితంగా తిరస్కరించాడు

Comments are closed.