శివను వదలని ‘మెగా’ ఫ్యాన్స్!

నిజానికి ఆచార్య ఫెయిలైనప్పుడు కొరటాల శివను చిరంజీవి-రామ్ చరణ్ పల్లెత్తు మాట అనలేదు.

ఆచార్య దెబ్బ నుంచి మెగాభిమానులు ఇంకా బయటకొచ్చినట్టు లేదు. కొరటాల శివపై వాళ్లు ఇంకా కోపంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల ఏదో స్టేట్ మెంట్ ఇస్తే, వీళ్లు దాన్ని తమకు అన్వయించుకున్నారు.

“నా పనికి నేను జవాబుదారీ. ఆ భయం నాకు ఉంది. ఎవడిపని వాడు చేస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. పక్కోడి పనిలో చేయి దూర్చి, ఆయన్ను ఇబ్బంది పెట్టి, మనం కూడా పూర్తిచేయకుండా వదిలేస్తే అది పెద్ద ఇబ్బంది.”

తాజాగా కొరటాల ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. అతడు ఓ సందర్భంలో ఈ స్టేట్ మెంట్ ఇస్తే, కొంతమంది దానికి మరో అర్థం తెచ్చిపెట్టారు. చిరంజీవి, రామ్ చరణ్ చేతులు పెట్టడం వల్లనే ఆచార్య రిజల్ట్ తేడా కొట్టిందని, ఆ విషయాన్నే కొరటాల పరోక్షంగా చెప్పుకొచ్చాడని కొందరు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

దీంతో మెగా ఫ్యాన్స్ మరోసారి అలర్ట్ అయ్యారు. కొరటాల శివపై ఇంకోసారి ట్రోలింగ్ షురూ చేశారు. నిజానికి ఆచార్య ఫెయిలైనప్పుడు కొరటాల శివను చిరంజీవి-రామ్ చరణ్ పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు ఆ తర్వాత కూడా అతడ్ని చాలా గౌరవంగా చూశారు.

కానీ చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది మాత్రం కొరటాలపై మినిమం గ్యాప్స్ లో ట్రోల్స్ వేస్తూనే ఉన్నారు. తాజా స్టేట్ మెంట్ తో వాళ్లకు మరోసారి అవకాశం దొరికింది.

3 Replies to “శివను వదలని ‘మెగా’ ఫ్యాన్స్!”

  1. అందుకని బాడీ లాంగ్వేజ్, కెమిస్ట్రీ కుదిరితేనే ఒక డైరెక్టర్, హీరో కలిసి చెయ్యాలి, లేకపోతే ఇలాగే ఒక ఆచార్య, ఒక గుంటూరు కారం, నేనొక్కడినే, అరవింద సమేత, నాన్న కు ప్రేమ తో లాంటి హాఫ్ కిచిడీ లు వస్తాయి.

Comments are closed.