కూటమి టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్?

విశాఖ జిల్లా పరిషత్ పూర్తి మెజారిటీతో వైసీపీ చేతిలో ఉంది. నూటికి తొంబై అయిదు శాతం మంది సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఇపుడు జడ్పీ పీఠాన్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ…

విశాఖ జిల్లా పరిషత్ పూర్తి మెజారిటీతో వైసీపీ చేతిలో ఉంది. నూటికి తొంబై అయిదు శాతం మంది సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఇపుడు జడ్పీ పీఠాన్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ కూటమి ప్రయత్నాలు మొదలెట్టింది అంటున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం మీద టీడీపీ కూటమికి చెందిన వారే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. దాంతో వారే ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా ఉంటారు. ఆ మీదట కూటమి వైపు చూసే వారికి చూడాలని అనుకుంటున్న వారికి ఆకర్షిస్తే విశాఖ జడ్పీ చైర్మన్ పదవి వచ్చి తమ ఖాతాలో పడుతుందని కూటమి నేతలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు

వైసీపీకి అత్యధిక బలం జడ్పీ లో ఉంది. అందులో ఏజెన్సీలో ఎక్కువగా ఉంది. అక్కడ వారంతా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. వారితో పాటు ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ వైసీపీ వారే ఉండడం విశేషం. జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర కూడా ఏజెన్సీకి చెందిన వారే. విశాఖ జడ్పీ పీఠాన్ని ఎస్టీకి కేటాయించారు.

అలా సుభద్రకు ఈ పదవి వరించింది. ఆమె వైసీపీకి వీర విధేయురాలిగా ఉన్నారు. పైగా ఏజెన్సీలో వైసీపీని కాదని వెళ్ళిన వారికి రాజకీయంగా పుట్టగతులు లేకుండా ప్రజలు చేస్తున్నారు. ఈ క్రమంలో జెడ్పీ పీఠాన్ని తమ వైపు తిప్పుకోవడం ఎలా అని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు.

ఈ పరిణామాల క్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సుభద్రకు ఇస్తున్న భద్రతను ఒక్కసారిగా తగ్గించేశారు. ఇది ఒత్తిడి చేసే రాజకీయమా అని అంతా తర్కించుకునే పరిస్థితి ఉంది. విశాఖ ఏజెన్సీలో మారుమూలన ఉన్న ముంచింగ్ పుట్టు మండలానికి చెందిన సుభద్రకు నిబంధనల ప్రకారం భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.

అయితే ఆమెకు గన్ మెన్ లను తీసివేయడం పట్ల వైసీపీలో అంతా కలవరపడుతున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి జెడ్పీ చైర్ పర్సన్ వస్తున్నారని ఆమెకు భద్రతను కొనసాగించాలని వైసీపీ నుంచి డిమాండ్ వస్తోంది. తనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రతను తొలగించారని జెడ్పీ చైర్మన్ సుభద్ర మీడియాకు తెలియచేశారు. ఇది రాజకీయంగా సరైన నిర్ణయం కాదని వైసీపీ అంటోంది

6 Replies to “కూటమి టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్?”

    1. ఈ రోజు ఆదివారం కదా.. లడ్డు లో గొడ్డు మాంసం కలుపుకుని తిన్నావా..?

      అసలే మీ జగన్ రెడ్డి చాలా ఫేమస్..

  1. ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..

    జగన్ రెడ్డి కోసం ఇంకో మూడు కేసులు “సిద్ధం”… పక్కా ఆధారాలు దొరికాయి..

    అందులో ఒక కేసుమాత్రం దేశ వ్యాప్తం గా ప్రకంపనలు సృష్టించబోతోంది ..

    ఎప్పుడు బయటకు తీయాలనేది మాత్రం.. చంద్రబాబు ఆదేశాల మీద ఆధారపడి ఉంటుంది..

    1. బొక్కలే! ఉన్న కేస్ లొ పీకింది ఏమి లెదు. E-#V&-M తొ లక్కొచేసారు ఈసారికి. ముంగిపొయిన బెజవాడ, ఆమరావతి రియల్ ఎస్తేట్ చూస్కొండి ముందు

Comments are closed.