దేవర సినిమా ప్రీ రిలీఙ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. వేలాదిగా ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చేయడంతో, కంట్రోలు చేయడం సాధ్యం కాలేదు. దాంతో రెండు మూడు గంటల హంగామా తరువాత ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు. సాయంత్రం అయిదు గంటల టైమ్ కే బౌన్సర్లు, పోలీసులు చాలా వరకు ఎంట్రీలు మూసేసి, జనాల్ని బయటే వుంచేసారు. అప్పటికే లోపల లెక్కకు మించి జనాలు చేరిపోయారు. బయట అంతకు మించి వుండిపోయారు.
లోపల అప్పటికే ఎక్కువ మంది వుండిపోవడంతో, వాళ్లంతా స్టేజ్ వరకు వచ్చేసారు. సెలబ్రిటీలు వచ్చి కూర్చునే అవకాశం లేనంతగా జనం చేరిపోయారు. వాళ్లను వెనక్కు వెళ్లేలా చేయాలని ప్రయత్నించినా వీలు కాదు. చాలా వరకు ప్రయత్నించి, ప్రయత్నించి పోలీసులు చేతులు ఎత్తేసారు. నొవాటెల్ ప్రాపర్టీలకు చాలా నష్టం వాటిల్లడంతో వాళ్లు కూడా నిర్వహణ సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చేసారు.
అప్పటికీ అలస్యంగానైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని అనుకున్నారు. ముందుగా బయట వున్న జనాలను వెనక్కు పంపాలని ప్రయత్నించారు. కానీ ఎవరూ వెళ్లలేదు. ఈవెంట్ లేదు అని చెప్పి చూసినా వినలేదు. ఇవన్నీ చూసి ఇక ఈవెంట్ నిర్వహణ సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు.
లెక్కకు మించి పాస్ లు
ప్రతి ఈవెంట్ కు వినిపించే మాట, కెపాసిటీకి మించి పాస్ లు ఇచ్చారనే టాక్. ఈసారి కూడా అదే మాట బలంగా వినిపించింది. అది నిజమే అనిపించేలా వున్నారు వచ్చిన జనాలు. లోపలకు వెళ్లిన వాళ్లంతా పాస్ లు పట్టుకుని వెళ్లిన వాళ్లే. బయట వున్న వాళ్లు అంతా పాస్ లు కలిగిన వాళ్లే. అంటే ఏమనుకోవాలి? లెక్కకు మించిన పాస్ లు ఇచ్చారనే కదా.
ప్రతి ఈవెంట్ టైమ్ లో ఇలాగే వినిపిస్తోంది. ప్రతిసారి పొలీస్ లు నిర్వాహకులను, ఈవెంట్ మేనేజ్ మెంట్ వాళ్లను పిలిచి హడావుడి చేస్తున్నారు. తరువాత మళ్లీ మామూలే. అనుమతి ఇవ్వడానికి ముందు వెనుకలు, తరువాత మళ్లీ ఇవ్వడం, ఫ్యాన్స్ గడబిడ. చివరకు రభస. ఇదో చక్రం అయిపోయింది.
ఇవే మరి కిత కితలు!
ఏదేమైనా థియేటర్లో చూడం
బొచ్చు తెలుసురా నీకు … లోపల వున్న వాళ్ళలో సగంపైన మందికి పాస్ లు లేవు … సెలబ్రిటీ గ్యాలరీ లో కూడా పాస్ లు లేకుండా కూర్చున్నారు …
ఇదే పవన్ సినిమా కి జరిగి వుంటే, గ్రేట్ ఆంద్ర చెప్పే సంగతులు వేరేగా వుండేవి.
సుబ్బరంగా టీవీ లో చూడక.. ఎందుకీ టైమ్ అండ్ ఎనర్జీ బొక్క పనులు