టాలీవుడ్ లో డాన్స్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే డాన్స్. ఆ మాటకొస్తే డాన్స్ ను చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అని చెప్పుకోవాలి. అలా సినిమాల్లో డాన్స్ కు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు.. తెలుగు సినిమాల్లో డాన్స్ ట్రెండ్ ను ఓ మలుపు తిప్పారు చిరు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా చిరంజీవి డాన్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ అనిపించుకున్న గోవిందా కూడా తనకు చిరంజీవి స్ఫూర్తి అని చెప్పుకున్నారు. అమీర్ ఖాన్, అమితాబ్ లాంటి వాళ్లు ఇప్పటికీ చిరంజీవి డాన్స్ చూసి ఈర్ష్య పడుతుంటామని చెబుతుంటారు.
చిరంజీవి డాన్సులకు ఎలాంటి అవార్డులు రాలేదు. నిజానికి అలాంటి అవార్డులు లేవు కాబట్టి రాలేదు. ఇన్నాళ్లకు చిరంజీవి స్టెప్పులకు ఓ గుర్తింపు వచ్చింది. అది కూడా అలాంటిలాంటి గుర్తింపు కాదు. చిరంజీవి డాన్సులకు గిన్నిస్ బుక్ గౌరవం దక్కింది.
45 ఏళ్ల సినీ ప్రస్థానంలో.. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 స్టెప్పులు వేశారు చిరంజీవి. ఈ అరుదైన ఘనతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. చిరంజీవి నటించిన 156 సినిమాల్ని క్షుణ్నంగా పరిశీలించి, ఆయన డాన్స్ పెర్ఫార్మెన్సులు అన్నింటినీ క్రోడీకరించి, ఈ రికార్డును అందజేస్తున్నట్టు గిన్నిస్ బుక్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. ప్రపంచంలోనే దీన్నొక గొప్ప ఘనతగా వాళ్లు చెప్పుకొచ్చారు.
గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన క్షణం చాలా భావోద్వేగానికి గురయ్యానన్నారు చిరంజీవి. దీన్ని కలలో కూడా ఊహించని గౌరవంగా చెప్పుకొచ్చారు.
“గిన్నిస్ బుక్ రికార్డ్స్ కు నాకు సంబంధం ఏంటని అనుకునేవాడ్ని. నేను ఎప్పుడూ ఊహించనిది, నేను ఎప్పుడూ కలగనలేదు. నేను ఎదురుచూడని ఓ గొప్ప గౌరవం నాకు దక్కింది.”
నటుడిగా తన కెరీర్ మొదలవ్వడానికి డాన్స్ ఎంతగా ఉపయోగపడిందో చెప్పుకొచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత కూడా తన క్రేజ్ పెరగడానికి డాన్స్ కలిసొచ్చిందన్నారు. 5 పాటలుంటే సరిపోయే సినిమాల్లో కూడా.. కథకు భంగం కలిగినప్పటికీ, అప్పట్లో తనతో తప్పనిసరిగా 6వ పాటకు కూడా డాన్స్ చేయించేవారని గుర్తు చేసుకున్నారు.
బహుశా.. ఈ రికార్డ్ ను ప్రపంచంలో మరో నటుడు ఎవ్వరూ బీట్ చేయలేరేమో. ఎందుకంటే, ప్రస్తుతం సినిమాల్లో పాటలు తగ్గిపోతున్నాయి. ఉన్న పాటల్లో కూడా స్టెప్పులు వేసే హీరోలు తగ్గిపోతున్నారు. కాబట్టి… చిరంజీవి సాధించిన గిన్నిస్ బుక్ రికార్డ్ కలకాలం నిలిచిపోయేలా ఉంది.
ఇది రాయాలంటే నువ్వు ఎంతో క్షోభ అనుభవించి ఉంటావు కానీ నీకు ఏమి చేయలేని పరిస్థితి.
చాలా sattirical గా రాసారు మీకు అర్థం అవడం లేదు 😂😂
“అమీర్ ఖాన్, అమితాబ్ లాంటి వాళ్లు ఇప్పటికీ చిరంజీవి డాన్స్ చూసి ఈర్ష్య పడుతుంటామని చెబుతుంటారు”
is that the only criteria Aamir was selected?
😀. కాశ్మీరం కౌగిలి. పాపం మైఖేల్ జాక్సన్. తన steppulu ఎవరో ఎం గిలి చేసిన ఏమీ చేయలేదు.
Proud of telugu cinema….congratulations chiru sir
😂😂😂😂😂😂
24 వేలా? ఎవరు లెక్కపెట్టారు?
ఎదో వాళ్ళే రాసుకుంటారు వాళ్ళే గిన్నిస్ రికార్డు లు ఇచ్చుకుంటారు
కన్నీ కి జాతీయ అవార్డు లాగ 😂😂😂
చిరు హనుమంతుని భక్తుడు కానీ, అతనికి నటరాజుని ఆశీస్సులు వున్నాయి.
అవును
Michel జాక్సన్ కూడా తాతయ్యని కలవడానికి ట్రై చేసాడంట అప్పట్లో డాన్స్ tips కోసం 😂😂😂😂😂
మైఖేల్ చేసినవి 150 పాటలు జీవితం మొత్తానికి, అది చిరు చేసిన డాన్స్ సాంగ్స్ లో మూడవ వంతు. అలానే నెవెర్ ల్యాండ్ రాంచ్ లో టీన్ మగ పిల్లల బ్యాక్ ఎంజాయ్ చేసిన మైఖేల్ కి చిరు కి పోలిక పెట్టకు. జాక్సన్ ఒక ఫెయిల్యూర్ జీవితం లో.
తెలుగు సినిమా దెబ్బకు ఆస్కార్ అవార్డే అనుకున్నా, గిన్నిస్ బుక్ అవార్డుకు కూడా విలువ లేదని అర్థమైంది…
“అర్థం ” to అర్థం మార్చడం మనకే సాధ్యం.
enduku pudataru ra babu. Siggundali ilanti commets cheyadaniki. Induku kada tamil/kannada fans ki manam lokuva ayyedi. This should be a proud moment for all the telugu people. Learn to appreciate or get lost.
Ide award e kamal ko amtabh ko vachi unte mana relugu vallu anandam to pulakarinchi poye varu
edavaku…uttama l a n j a award…syco ki isataam..
Chivaraku gueniss book ki kuda value lekundaa chesaru