బాబూ త‌ప్పు ఒప్పుకోక‌పోతే.. వేంక‌టేశ్వ‌రస్వామి ఒప్పుకోరు!

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌ని, ఇప్ప‌టికైనా త‌ప్పు ఒప్పుకోవాల‌ని, లేదంటే క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఒప్పుకోర‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో…

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెప్పార‌ని, ఇప్ప‌టికైనా త‌ప్పు ఒప్పుకోవాల‌ని, లేదంటే క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఒప్పుకోర‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగితే ఇన్ని రోజులు ఏం చేస్తున్నావ‌ని నిల‌దీశారు.

వైఫ‌ల్యాల నుంచి త‌ప్పించుకోడానికే చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు తెర‌లేపార‌ని వెల్లంప‌ల్లి మండిప‌డ్డారు. శ్రీ‌వారి భ‌క్తుడ‌ని చెప్పుకునే చంద్ర‌బాబు తిరుమ‌ల ప్ర‌సాదంపై దుర్మార్గ రాజ‌కీయానికి పాల్ప‌డ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ల‌డ్డూ ప్ర‌సాదంపై సీఎం చంద్ర‌బాబు, టీటీడీ ఈవో శ్యామ‌లారావు మాట‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేద‌న్నారు. ఒక‌వేళ క‌ల్తీ అయింద‌నేందుకు ఆధారాలుంటే చ‌ర్య‌లు తీసుకోవాలి క‌దా? సిట్ ఎందుకని మాజీ మంత్రి ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు వంద‌రోజుల పాల‌న పూర్తి చేసుకున్నార‌ని, చెప్పుకోడానికి ఏమీ లేక‌పోవ‌డంతో ల‌డ్డూ ప్ర‌సాదంపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని వెల్లంప‌ల్లి అన్నారు. గ‌తంలో స‌నాత‌న ధ‌ర్మం లేన‌ట్టు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతున్నార‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. చెప్పులు వేసుకుని దీక్ష‌లు చేయ‌డం ప‌వ‌న్‌కే చెల్లింద‌ని వెల్లంప‌ల్లి విమ‌ర్శించారు. స‌నాత‌న ధ‌ర్మంపై నీతులు చెప్ప‌డానికి ముందు, ప‌వ‌న్ ఆచ‌రించాల‌ని మాజీ మంత్రి హిత‌వు చెప్పారు.

హ‌రికృష్ణ మృత‌దేహం వ‌ద్ద పొత్తుల గురించి మాట్లాడిన నీచ చ‌రిత్ర చంద్ర‌బాబుది అని ఆయ‌న విమ‌ర్శించారు. ల‌డ్డూ ప్ర‌సాదంపై సుప్రీంకోర్టు నేతృత్వంలో విచార‌ణ జ‌ర‌పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌ప్పు ఒప్పుకుని చంద్ర‌బాబు ప్రాయ‌శ్చిత్త దీక్ష చేయాల‌ని ఆయ‌న కోరారు.

8 Replies to “బాబూ త‌ప్పు ఒప్పుకోక‌పోతే.. వేంక‌టేశ్వ‌రస్వామి ఒప్పుకోరు!”

  1. కొబ్బరి చిప్పలు మాజీ మంత్రి గారు వెండి సింహం ఇంకా దొరికినట్లు లేదు

  2. తం*డ్రి శ*వం కోసం వెళ్ల*కుండా శ*వం కూడా దొరకముందే సిఎం పదవి కోసం సంతకాలు కోసం ఆడు*క్కున్న పం*ది ఎవడు రా గూ*ట్లే ?

Comments are closed.