తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక

భవిష్యత్తులో ఎన్నడైనా ఈ బంధం పుటుక్కుమనే అవకాశం ఉన్నదా? అనే భయం కొందరిలో ఉండొచ్చు.

కొన్ని బంధాలు క్రమక్రమంగా క్షీణిస్తూ నెమ్మదిగా శిథిలమైపోతాయి. కానీ మరికొన్ని బంధాలు అలా కాదు.. చివరిక్షణం వరకు చాలా గట్టిగా ఉంటాయి. హఠాత్తుగా పుటుక్కుమంటాయి. బుద్బుధప్రాయమైన మానవ జీవితం వంటివి అన్నమాట. కొన్ని అనుబంధాలలో కూడా హార్ట్ ఎటాక్ వంటి దెబ్బ పడుతుంది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే.. ఆ బంధం అంతరించిపోతుంది.

అమంగళము అప్రతిహతమగుగాక! తెలుగుదేశం- జనసేన మధ్య ఉన్న బంధం ఇప్పట్లో తెగిపోయే అవకాశం ఎంతమాత్రమూ లేదు. ఈ రెండు పార్టీల అగ్రనేతలు పరస్పరం గౌరవించుకుంటూ, పరస్పరం విలువ ఇచ్చుకుంటూ అద్భుతమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. కానీ.. భవిష్యత్తులో ఎన్నడైనా ఈ బంధం పుటుక్కుమనే అవకాశం ఉన్నదా? అనే భయం కొందరిలో ఉండొచ్చు. ప్రస్తుతానికి కొన్ని సంకేతాలు అదేవిధంగా కనిపిస్తున్నాయి. అంతా సవ్యంగానే ఉన్నది.. ఏం భయంలేదు.. కానీ ఏదో జరుగుతున్నది అనే శంక! ఆ వైనం మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఒకటో ప్రమాద హెచ్చరిక’!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో కూడా ఉన్నది వారే కాబట్టి.. ఇది డబల్ ఇంజిన్ సర్కార్. ఇలాంటి ప్రభుత్వాల వల్ల రాష్ట్రాలకు ఎంత గొప్ప మేలు జరుగుతుందని బిజెపి ప్రచారం చేసుకుంటూ ఉంటుందో అలాంటి మేలు రాష్ట్రానికి ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. పథకాలకు నిధులు వస్తున్నాయి. పనులు పూర్తయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. అమరావతి అనే రాజధాని సంకల్పం దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా బాగానే ఉంది. కానీ.. కూటమి పార్టీల మధ్య నిజమైన ఐక్యత ఉందా?

‘ఐక్యత ఉందా’ అనే సందేహం లేవనెత్తే ముందు ‘నిజమైన’ అనే పదాన్ని జోడించక తప్పదని కూడా అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ ఐక్యత ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. మూడు పార్టీల మధ్య అద్భుతమైన సమన్వయం కనిపిస్తోంది. అంతా ఒకటే జట్టు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి పొరపొచ్చాలు కూడా రావడం లేదు.

మంత్రి నారా లోకేష్ వచ్చినప్పుడు.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేచివెళ్లి సాదరంగా ఆహ్వానించడం తెలుగుదేశం వారికి పండగలాగా అనిపించవచ్చు. అలాగే.. పవన్ కల్యాణ్ ఫోటోను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమానంగా ప్రతి ప్రభుత్వ పథకం మీద ముద్రిస్తూ ఉండడం అనేది జనసైనికులకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుండవచ్చు. జగన్ పాలనలో డిప్యూటీ ముఖ్యమంత్రులకు దక్కిన గౌరవం చూసిన వారికి పవన్ చాలా ఘనమైన ఆదరణ పొందుతున్న ఆనందం కలుగుతుండవచ్చు.

నిర్ణయాలు కూడా ఒకరిని మరొకరు అతిక్రమించకుండా తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతో సాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా చాలా చక్కగా సహకరిస్తోంది. కేంద్రం నుంచి అనూహ్యంగా పథకాలకు, రాజధానికి సహకారం అందుతోంది. అంతా బాగున్నది అంటూనే ప్రమాద హెచ్చరికల గురించి మాట్లాడడం అర్థరహితం కదా అనిపించవచ్చు. మరద్దే అసలు పాయింటు.

పార్టీలు విస్తరించవా?

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో కూటమిలో చేతిలో 164 ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే, 175 సీట్లను కూటమి పార్టీలు ఎలా పంచుకున్నాయనేది ముఖ్యం. జనసేనకు 21, బిజెపికి 10 సీట్లు మాత్రం ఇచ్చి 144 సీట్లలో తెలుగుదేశం పోటీచేసింది. ఆ సమయానికి వారి బలాలను బట్టి సీట్లు పంచుకున్నారు. భాగస్వామి పార్టీల్లో అప్పుడు కూడా అసంతృప్తి లేకపోలేదు. కానీ.. గెలుపు లక్ష్యంగా ఒప్పుకున్నారు. అప్పుడు సీట్లు పంచుకున్న దామాషా అనేది చంద్రబాబునాయుడుకు పెద్ద ఎడ్వాంటేజీ అయింది. ఆ తర్వాత.. పరిపాలన మొదలెట్టాక కూడా.. చంద్రబాబు నాయుడు అదే దామాషాను ఒక బెంచ్ మార్క్ లాగా వాడుకుంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా చంద్రబాబు అచ్చంగా సీట్లు పంచుకున్న దామాషాలోనే పదవులు పంచుతాం అని పదేపదే అనడం ద్వారా.. ఎక్కువ ఆశ పెట్టుకుని ఉన్న భాగస్వామి పార్టీలను మానసికంగా సిద్ధం చేసేశారు.

అయితే నిజానికి నామినేటెడ్ పోస్టులు వంటి చాన్స్ వస్తే ఎక్కువ ప్రయారిటీ దక్కవలసింది ఎవరికి? జనసేన, బిజెపి ఎమ్మెల్యే సీట్లలో ఎక్కువ త్యాగాలు చేశాయి గనుక.. వారికి నామినేటెడ్ ఎక్కువ దక్కాలి కదా. కానీ ఆ లాజిక్ మాట్లాడే స్థితిలో ఆ రెండు పార్టీలు లేవు. ఇంకా నయం.. సీట్లు పంచుకున్న దామాషాలో పంపంకం అంటున్నారు.. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలం దామాషాలో పంపకం అనడం లేదు- అన్నట్టుగా వారు సర్దుకుంటున్నారు.

కానీ జీవితాంతం ఇలాగే సాగదు కదా. పవన్ కల్యాణ్ తను సొంతంగా పార్టీ పెట్టి.. సినిమా ఇండస్ట్రీ ద్వారా వచ్చే పెద్ద సంపాదనలను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది కేవలం 21 సీట్లు పంచుకుంటూ ఉండే స్థాయిలో మిగిలిపోవడానికి కాదు కదా. కేంద్రంలో హ్యాట్రిక్ సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఏపీలో మాత్రం.. భాగస్వామి విదిలించే 6-7 శాతం సీట్లతో కలకాలం తృప్తి పడుతూ కూర్చోదు కదా.

ఆ పార్టీలు కూడా విస్తరిస్తాయి. పార్టీలు విస్తరించడం, బలపడడం అంటూ జరిగితే.. వచ్చే ఎన్నికల నాటికి.. ఎమ్మెల్యే సీట్ల పంపకాల దామాషాలు మారుతాయి. అంటే ఏమిటన్న మాట.. ఆ రెండు పార్టీల బలం ఎంత పెరుగుతుందో.. దానికి తగినట్టుగా తమ చేతిలో ఉన్న సీట్లను త్యాగం చేయడానికి తెలుగుదేశం సిద్ధపడాలన్నమాట. లేకపోతే ఏమౌతుందన్నమాట? కూటమి ఐక్యతలో పగుళ్లు వస్తాయన్నమాట!

జనసేన బలపడడం తథ్యం!

2019 ఎన్నికల సమయానికి తనకున్న చరిష్మా ఒక్కటీ అధికారంలోకి తీసుకురాగలదనే అపోహలలో పవన్ కల్యాణ్ ఉండేవారు. ఆ ఎన్నికల తర్వాత ఆయనకు భ్రమలు తొలిగాయి. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి. అంత పెద్దసెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ ఉండే వ్యక్తి.. తను నమ్మినవి భ్రమలు అని తొందరగా గ్రహించి.. ప్రాక్టికాలిటీలోకి వచ్చి ఈగో లేకుండా.. పూర్తిగా సరికొత్త వ్యూహంతో 2024 ఎన్నికలకు సిద్ధమైనందుకు ఆయనను అభినందించాలి. అందుకు సత్ఫలితాన్ని అందుకున్నారు. అలాగని ఆయన పార్టీ ఇక్కడ ఆగిపోదు. విస్తరిస్తుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కిన పరాజయానికి, ఆ పార్టీలో ఓటమి తర్వాత కూడా మారకుండా ఉన్న అధినాయకుడు జగన్ వైఖరికి విసిగిపోయిన వారు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఓటమికి కారణమైన కోటరీ మీదనే ఇప్పటికీ ఆధారపడి జగన్ రాజకీయాలు చేస్తుండడం వలన.. పార్టీలోని నాయకులకు విసుగు పుడుతోంది. ఆయన తీరు మారకుంటే కష్టం అని వెళ్లిపోతున్నవారు రాజకీయాల్లో కొనసాగదలచుకుంటే.. వారికి మెరుగైన ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే.

తెలుగుదేశంలో చేరడం చాలా మందికి కష్టం. ఇన్నాళ్లూ టీడీపీతో స్థానికంగా సంకుల సమరాలు సాగించి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఇప్పుడు తెదేపాలో చేరడం వారికి సాధ్యం కాదు. ఇక మిగిలిన బెటర్ ప్రత్యామ్నాయం జనసేన మాత్రమే. నిన్నటిదాకా పవన్, నాదెండ్ల తప్ప మరో సెలబ్రిటీ నాయకుడు లేని జనసేనకు ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తోడయ్యారు. మూడు ప్రధాన కులాలు రెడ్డి, కమ్మ, కాపు ప్రతినిధులు ఇప్పుడక్కడ సెలబ్రిటీ నాయకులుగా ఉన్నారు. ఆ పార్టీ విస్తరణ జరుగుతుంది. ఇలా నాయకులు పెరగడం వలన.. అచ్చంగా వారి సీట్ల కోసమే జనసేన పట్టుపట్టకపోవచ్చు. కానీ ఖచ్చితంగా 2024 ఎన్నికల నాటికి 21 సీట్లకు పరిమితమై పోటీచేయదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలం.

వలసలకు జనసేన సుముఖంగానే ఉన్నా.. కొంత కాలం ఆగి ఇప్పుడే ప్రారంభించారు అనడానికి కిలారు రోశయ్య ఒక ఉదాహరణ. కిలారు రోశయ్య అక్కడ పార్టీకి రాజీనామా చేసి చాలా కాలమైంది జనసేనలో చేరడం మాత్రం తాజాగా చోటు చేసుకుంది అంటే ఇన్నాళ్లుగా మాటామంతి పూర్తయినప్పటికీ లాంచనప్రాయమైన చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనుకోవాల్సి వస్తోంది. బాలినేనితో పాటు ఉదయభాను కూడా చేరారు. పార్టీ బలం పెరుగుతోంది. ముందు ముందు జనసేన బలం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలోనే జనసేన కేడర్ 60 సీట్లకు పట్టుబట్టారు. పట్టువిడుపు పాటించారు. 2029లో పట్టువిడుపు ఉంటుందనే గ్యారంటీ లేదు. జనసేనకు ఖచ్చితంగా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది.

ఇప్పుడు జనసేనకు ఇచ్చిన వాటిలో సగం సీట్లు బిజెపి పుచ్చుకుంది. 2029నాటికి కూడా వారు అదే ‘దామాషా’ కోసం పట్టుపడతారు. ఈ పరిణామాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికే. జనసేన బలపడే కొద్దీ.. ప్రమాద హెచ్చరిక యొక్క నెంబరు పెరుగుతూ ఉంటుంది. కానీ కూటమి పార్టీలు గుర్తుంచుకోవాల్సిన సంగతేంటంటే.. ఐక్యత వారికి తప్పనిసరి. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకుల పరంగా ఎంతగా గండికొట్టినా సరే.. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ప్రతిసారీ 11 కు పరిమితం చేస్తారనుకోవడం భ్రమ. ఐక్యత దెబ్బతింటే వైసీపీ పుంజుకుంటుంది.

చంద్రబాబు త్యాగాలకు సిద్ధమేనా?

ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడుకు చాలా గొప్ప ఫలితాలే ఇచ్చాయి. కూటమి పార్టీలను బయటకు గెంటేసినా సరే.. ఆయన తెలుగుదేశం ప్రభుత్వాన్ని నడపగలరు. కానీ, వారితో తెగతెంపులు చేసుకుంటే 2029 ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోవడానికి తగిన ధైర్యం ఆయనకు ఉన్నదా? అంటే అనుమానమే.

జనసేన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి అనూహ్యంగా బలపడుతుంది. కేవలం వైసీపీ నుంచి వచ్చే వలసల వల్ల మాత్రమే బలపడుతుందనుకుంటే పొరబాటు. పవన్ కల్యాణ్ గానీ, ఆయన పార్టీ మంత్రులు గానీ పనిచేస్తున్న తీరు కూడా ఆ పార్టీ బలపడడానికి దోహదం చేస్తాయి. అనూహ్యంగా బలపడితే.. వారికి తగినన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. తన పార్టీ వారిని చంద్రబాబునాయుడు ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తూ ఉండాలి. పరోక్షంగా తమ పార్టీకి త్యాగాలు తప్పవని వారికి ఇంజెక్ట్ చేస్తూ రావాలి.

చంద్రబాబుకు వేరే గత్యంతరం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. బలం బాగా పెరిగిన తర్వాత.. 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశంతో కలిసి పోటీచేయాలా లేదా అనేది పవన్ కల్యాణ్ దయ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు త్యాగాలకు సిద్ధపడకపోవడం వల్ల వారు విడిగా పోటీచేస్తే, అది పవన్ కల్యాణ్ కే పార్టీ ఎదగడం పరంగా లాభం. ఆయన బిజెపితో కలిసి 175 స్థానాల్లో పోటీచేసి కనీసం 100 స్థానాల్లో బలపడతారు. సందట్లో సడేమియా అన్నట్టు వైసీపీ మళ్లీ గెలిచినా ఆశ్చర్యం లేదు. అలా జరగకూడదంటే.. ఎంత ఘోరమైన త్యాగాలు చేయాల్సి వచ్చినా చంద్రబాబునాయుడు ఓకే చెప్పాలి.

అలా కాకుండా.. జనసేన పార్టీ పడకుండా కుటిల పన్నాగాలు చేసినా, వారి పార్టీలో తెర వెనుక నుంచి లుకలుకలకు ప్లాన్ చేసినా.. స్నేహం బెడిసికొట్టి పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది. కాబట్టి.. కొత్తగా జరుగుతున్న చేరికలు, జనసేనకు పెరుగుతన్న బలం.. కూటమి ప్రభుత్వానికి, ప్రధానంగా తెలుగుదేశానికి ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికే అని ఒప్పుకోవాలి.

..ఎల్. విజయలక్ష్మి

29 Replies to “తెలుగుదేశం- జనసేన బంధం ఒకటో ప్రమాద హెచ్చరిక”

  1. ఒరేయ్ విజయ లక్ష్మి గా, నీకు అర్థం కానీ విషయం ఏంటంటే ja*** శ్రీవారి పట్ల చేసిన మహాపాతకానికి 10000000000 నంబర్ ప్రమాద హెచ్చరిక అని చెప్పుకోవాలి రా !!

  2. అధికారం లో ఉంది ఎలక్షన్ వెళ్లడం సవాలు jagan అన్ని చేసిన కుడా ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ఏమి చెయ్యలేక జగన్ భజన తో ఉంది అది జగన్ కీ మంచి చేసింది

  3. PK ఈగొఇస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ …చంద్రబాబు అనుభవంతొ సర్దుకు పొవాలి

    ఒక్కటె గుర్తు పెట్టుకొండి ..

    PK జగన్ కంటె గర్విష్టి

  4. జగన్ కు శవాలంటే ఎంత ప్రాణమో, జీఏ కు స్మశానం అంటే అంత ప్రాణం. ఆంధ్ర రాష్ట్రం ఎపుడు ఎపుడా అని వల్లకాడు అవుతుందో అని కాసుకు కూర్చున్నారు జీఏ, జగన్ లు.

  5. మీరు ఎన్నైనారాసుకోండి .ఈరెండుపార్టీలకు లాభనష్టాలబేరంవుంది .ఆవేశాలకుపోయి ఎవరూకూడ లాభాల్ని వదులుకోరు .కాబట్టి నాల్గుసంవత్సరాలుకొనసాగుతుంది చివర్లో ఏంజరుగుతుందో చెప్పలేం .మీకుమాత్రం దురాశ దఖమునకుచేటు .

  6. మొన్న జనసేనా లో క్యాండిడేట్స్ నీ జాయిన్ అవ్వకుండా టిడిపి లో ఐతే చంద్ర బాబు పవన్ నీ కట్టడి చేశాడని రాతలు రాసావ్. ఏదైనా పుల్లలు పెట్టడం కామన్

  7. బాలినేని వల్ల రెండూ పార్టీల్లో కచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యాడు కాబట్టి సైలెంట్ గా పవన్ చెప్పినట్టు వింటున్నాడు. కొన్ని రోజులయ్యాక అతని గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు.

    1. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు జనసేనలో. బాలి రెంటికీ చెడ్డ రేవడి అవుతాడు. He will be a joker. Wait and watch.

  8. అక్కోయ్ నీవెంత బాకా ఊదినా వీల్ల రొచ్చు రోజురోజుకి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతునే ఉంది… పధకాలకి సొమ్ము వస్తుంటే అస్సలు ఏ పధకాలకి ఖర్చు పెట్టేస్తుంది… పైగా మాటాడితె ఖజానా ఖాళి అంటు డైలాగులు వినబడుతున్నాయి.. ఎన్నికల వాగ్దానాలు మాట తప్పేసి వాటినుండి జనాల మైండ్ డైవర్షన్ కోసం అడ్డమైనా రొచ్చు చేస్తు అడ్డంగా దొరికిపోతునే ఉంది. 2014/19 వరకు ఉన్న పాలనే కనబడుతుంది .

  9. nenu ycp abhimaaని ని మా ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఎప్పటికయినా వీళ్ళు విదిడ్ పోకా పోతారా సేనాని కి చికకొచ్చి మీద నిప్పులు చేరగాక పోతారా ఏదో ఒక పంపకాల విషయం లోనో ఇంకో చోటో సమస్యలు రాక పోతాయ కేద్న్రం లో కాషాయ దళం కన్నెర్ర చేసి బీటలు వారదా ఆధీ నా ఆశ శ్వాశ .అధికారం వస్తే మేము జత్వని ని ఇబ్బద్ఘి పెట్టడం అయిన వాళ్ళను కాపాడటం గనులు ఇసుక మట్టి అవి ఇవీ అడ్డంగా తినేయడం లాంటివి చేసాం ఇప్పుడు ఇలా చేత్శున్నం

  10. జేత్వాని కేసు లో విశాల్ గుణని క్రాంతి లాల్ ఆడంగ దొరికారు పాపం

  11. ఈ బంధం 3 నల్ల ముచ్చటే! ఎందుకంటే నీగూడంగా ఆలోచిస్తే టీడీపీకి ఎవరి సహాయం అవసరం లేదు ఎందుకంటే దేశం లోనే ప్రాంతీయ పార్టీ లలో బలమైన పార్టీ ఒక్క టీడీపీ నే..

    కానీ జనసేన అలా కాదు అసలు చాలా చొట్ల వోట్లు పడవ్ ఒక్క కోస్తా ఏరియా లో తప్పా అది కొన్ని నియోజక వర్గాల కే పరిమితం. మరీ ముక్యం గా మీడియా లేదు డబ్బు లేదు వెనక సపోర్ట్ లేదు కానీ ఉన్నది ఆకర్షణ ఒక్కటే.

    టీడీపీ కోరుకునేది ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా చీకాకులు సృష్టించే వారు ఉండకూడదు..అందుకే టీడీపీ పవన్ ని దువ్వుతోంది..రేపు పవన్ కాంగ్రెస్ లో కలిపి ఒక చీర సీఎం అయ్యి పక్కకి తప్పుకున్నా హాచర్యం లేదు. మనకి మాత్రమే అన్నీ హాచర్యాలే .బిత్తర పోయి చూడటం తప్ప చెయ్యటానికి ఏమి లేదు. అధికారంలో ఉన్నప్పుడే సజవుగా చేసుకొని ఉంటే బాగుండేది ..ఏడవటం తప్ప చెయ్యగలిగింది ఏమి లేదు

  12. “Hydra ను అడ్డుపెట్టుకొని శని, ఆదివారాలు, సూర్యోదయం ముందర, మిట్ట మధ్యాహ్నం వేళలో, వర్షం పడుతున్నప్పుడు, ఎండా అధికంగా ఉన్నప్పుడు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.”

  13. ఒరె పి..చ్చి కు…క్క అలియాస్ PK

    తప్పు వుంటె దొషులను పట్టుకొ లెకపొతె మూసుకొ

    అంతె కాని ఈ నమొ నారాయణ ఎంటి రా సన్నాసి వెదవా

    నువ్వు నీ ఒవర్ యాక్షన్

  14. తిరుమల లడ్డు కల్తీ తో వై చీపి హీన పక్షంలో 10% హిందూ ఓట్ బ్యాంక్ కి గండి కొట్టుకుంది..గుర్తుపెట్టుకోండి వై చీపి లో ఉండే 5% హిందు బ్యాచ్ మొత్తం జనసేన లో కలుస్తుంది..ఇంకా మిగిలింది 25% మంది అందులో కాంగ్రెస్ బలోపేతం అయితే హీన పక్షంలో 10% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది.. వచ్చే 4ఏళ్లలో జగన్ జీవితం చివరి అధ్యాయంలో ఉంది..

    మళ్ళీ నాలుగేళ్లలో మాట్లాడుకుందాం

  15. Step 1 :- వైసీపీ ఓటమి

    Step 2 :- కాస్తో కూస్తో ఉన్న నిజాయతీ గల నాయకులు లాగేయడం..

    Step 3 :- నువ్వు చేసిన అక్రమాలు, అవినీతి బయటపెట్టి, నిన్ను ప్రజలతోనే ఛీ కొట్టించడం..

    Step 4 :- నువ్వు, నీ తోటి ఎదవలు జైల్ లో చిప్పకూడు తినిపించడం..

    Step 5 :- ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

Comments are closed.