మ‌బ్బుల్లో సీక్వెల్స్.. మొద‌టికే మోసం!

అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచినే సీక్వెల్స్ సీక్వెల్స్ అంటూ జ‌నాల‌ను చావగొడుతున్నారు టాలీవుడ్ ద‌ర్శ‌క మేధావులు!

ఒక్క సినిమా క‌థ స‌రిగా చెప్పండ్రా అంటే.. అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచినే సీక్వెల్స్ సీక్వెల్స్ అంటూ జ‌నాల‌ను చావగొడుతున్నారు టాలీవుడ్ ద‌ర్శ‌క మేధావులు!

చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు.. ఇప్పుడు ప్ర‌తీదీ అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచినే రెండు పార్ట్ లు, మూడు పార్ట్ లు అంటూ ప్ర‌క‌టించుకుంటూ ఉన్నారు. మ‌రి దీని వ‌ల్ల వీరు సాధిస్తున్న‌ది ఏమిటి? అనేది స‌మాధానం లేని ప్ర‌శ్న‌!

ఇప్ప‌టికిప్పుడు లెక్క పెడితే, అట్ట‌ర్ ఫ్లాప్ సినిమాల‌కూ, హిట్ సినిమాల‌కూ బోలెడ‌న్ని సీక్వెల్ ముచ్చ‌ట్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇవి ఏర‌కంగానూ ఆస‌క్తిని క‌లిగించ‌డం లేదు. అస‌లు సీక్వెల్ గురించి ఎదురుచూపు అనేది ప్రేక్ష‌కుల్లో లేన‌ప్పుడు ఇవి ఆస‌క్తిక‌రం ఎలా అవుతాయి?

ఏ ముహూర్తాన బాహుబ‌లి విష‌యంలో రెండో పార్ట్ కోసం భ‌యంక‌ర‌మైన హైప్ ను క్రియేట్ చేశారో, ఏ ముహూర్తాన ఆ సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుందో.. అప్ప‌టి నుంచి టాలీవుడ్ కు ఈ సీక్వెల్ జాడ్యం ఎక్కువ అయ్యింది. అది ప‌రాకాష్ట‌కు చేరింది. బ‌హుశా ఇదంతా మార్కెటింగ్ స్ట్రాట‌జీ కోసం చేస్తున్న ప‌నే. అందులో బ‌హుశా అన‌డం కూడా అన‌వస‌రం.

అయితే సీక్వెల్స్ మ‌బ్బుల్లో నీళ్ల లాంటివి, వాటిని చూసుకుని ముంత‌లో నీళ్ల‌ను ఒల‌గ‌బోసుకున్న‌ట్టుగా.. సీక్వెల్స్ విష‌యంలో అత్యాశ అనేది మొద‌టికే మోసాన్ని తెస్తోంద‌నే విష‌యాన్ని టాలీవుడ్ జ‌నాలు గ్ర‌హిచంలేక‌పోతున్నారా, లేక గ్ర‌హించ‌న‌ట్టుగా న‌టిస్తున్నారా అనేది శేష ప్ర‌శ్న‌!

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మొద‌టి నుంచి సీక్వెల్స్ ప‌ట్ల పెద్ద ఆస‌క్తి లేదు. ఇది ద‌శాబ్దాల కింద‌టే రుజువు అయ్యింది.

రామ్ గోపాల్ వ‌ర్మ కంపెనీలో *మ‌నీ* సినిమా మంచి హిట్. చిన్న సినిమాగా వ‌చ్చి, విడుద‌ల‌కే ఎదురుచూపులు చూసి. ఎలాగో విడుద‌లై.. మంచి హిట్ అయిన సినిమా అది. అలా హిట్ ఫార్ములాను క్యాష్ చేసుకోవాల‌నే ఆరాటంలో అప్పుడే వ‌ర్మ కంపెనీ, మ‌నీ మ‌నీ అంటూ రెండో పార్ట్ ను అనౌన్స్ చేసి, మ‌నీ ఇమేజ్ ను మ‌నీ చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేసింది! అయితే మ‌నీమనీ సినిమా ఎవ‌రిలోనూ ఆస‌క్తిని క‌లిగించ‌లేక‌పోయింద‌ట‌, ఆ సినిమా ఫ్లాప్ అని నాటి సినీప‌రిశీల‌కులు చెబుతారు!

అలా సీక్వెల్ అనేది పెద్ద‌గా ప‌ట్ట‌ని స‌బ్జెక్ట్ తెలుగు వాళ్ల‌కు అనేది రుజువు అయిన అంశం. ఆ త‌ర్వాత వ‌ర్మ కంపెనీ వాళ్లే ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌ను ఒక సినిమా నుంచి మ‌రో సినిమాలో కొన‌సాగించ‌డం వంటి ప్ర‌యోగాలు చేశారు. అయితే అవేవీ రిజిస్ట‌ర్ కూడా కాలేదు!

ఆ త‌ర్వాత బాలీవుడ్ లో సీక్వెల్స్ జోరందుకోవ‌డంతో.. మ‌నం కూడా అలాంటివి చేయొచ్చు అనే ఆస‌క్తి టాలీవుడ్ మ‌ళ్లీ మొద‌లైంది. అయితే అప్ప‌టికీ ప్రేక్ష‌కుల రిజ‌క్ష‌న్ త‌ప్ప‌లేదు.

హిందీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ హిట్ కావ‌డంతో దాన్ని శంక‌ర్ దాదాగా రీమేక్ చేసి, ఫ‌ర్వాలేద‌నిపించారు. అయితే మున్న‌భాయ్ కు హిందీలో వ‌చ్చిన సీక్వెల్ ను చిరంజీవి చేతే రీమేక్ చేయించి డిజాస్ట‌ర్ ను రిజిస్ట‌ర్ చేయించారు. అలా కూడా సీక్వెల్ తెలుగులో యాంటీసెంటిమెంట్ గానే నిలిచింది.

మున్నాభాయ్ ను త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా రీమేక్ చేశారు. అయితే వారెవ‌రూ సీక్వెల్ జోలికి వెళ్ల‌లేదు. తెలుగులో మాత్రం సీక్వెల్ తీసి చేతులు కాల్చుకున్నారు!

సీక్వెల్ ను క‌థ డిమాండ్ చేస్తోందా?

సీక్వెల్ ను క‌థ డిమాండ్ చేస్తోందా లేక మార్కెటింగ్ కోసం సీక్వెల్ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటూ ఉన్నారా అనేది ఇప్పుడు ఈజీగానే తేలే అంశం. కేవ‌లం మార్కెట్ ను క్యాష్ చేసుకోవ‌డానికి ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూ ఉన్నాయి.

తాము చెప్పాల‌నుకున్న క‌థను ఒక్క భాగంలో చెప్ప‌లేము అని ద‌ర్శ‌క‌ర‌త్నాలు ఫీల్ కావ‌డం వారి అతే త‌ప్ప అంత‌కు మించిందేమీ లేదు. కావాలంటే మూడు గంట‌ల సేపు సినిమా తీసుకోవ‌చ్చు, అయితే ప్రేక్ష‌కుడికి ఎలాంటి ఫీలింగ్ నూ పూర్తి స్థాయిలో క‌లిగించ‌కుండా ఇంటికి పంప‌డం అనేది ఒక‌ర‌కంగా మోసం చేయ‌డ‌మే!

ఇప్పుడు సీక్వెల్స్ పెండింగ్ లో ఉన్న సినిమాల సంగ‌తే మాట్లాడుకుంటే.. స‌లార్, క‌ల్కి వంటి సినిమాలున్నాయి. ఇవి ఒక‌ర‌కంగా ప్రేక్ష‌కుడిని చీట్ చేశాయి. చాలా సేపు థియేట‌ర్లో కూర్చోబెట్టి.. ఎలాంటి కంక్లూజ‌న్ ఇవ్వ‌కుండా అసంపూర్ణ‌మైన ఫీలింగ్ తో ప్రేక్ష‌కుడిని ఇంటికి పంపాయి.

అస‌లు స‌లార్ సినిమా క‌థ ఏమిటో కూడా ఫ‌స్ట్ పార్ట్ చూసిన సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుల‌కు అర్థం కాదు. ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకుంటున్నాడో, ఎలా చెప్పాల‌నుకుంటున్నాడో, ఆ చెప్ప‌డం రెండు పార్ట్ ల‌తో అయినా పూర్తి అవుతుందో ఇదేం అర్థం కాదు!

కల్కి సంగ‌తి స‌రేస‌రి! అది ఐదు పార్టులుగానో ఏమో తీస్తార‌ట‌! ఎన్ని అయినా తీసుకోని అడిగేవ‌డు ఎవ్వ‌రు? నిస్సందేహంగా చెప్ప‌గ‌ల అంశం ఏమిటంటే.. ఫ‌స్ట్ పార్ట్ పై ఉన్న ఆస‌క్తి, రెండో పార్ట్ పై సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుల్లో ఉండ‌దు!

బాహుబ‌లి 2 అందుకు భిన్నం క‌దా అని వాదించ‌వ‌చ్చు. అయితే స‌లార్-2 గురించి ఇప్పుడు ఆలోచించే సినిమా ప్రియుడు ఎవ‌రైనా ఉన్నారా! వీరాభిమానులను ప‌క్క‌న పెడితే.. ఆ సినిమా ఎప్పుడు వ‌స్తుందో, ఆ సినిమా క‌థ ఏమిటో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉన్న‌ది ఎంత‌మందికి?

స‌లార్ 2కు వీరాభిమానుల ఓపెనింగ్స్ ఉండ‌వ‌చ్చు, అయితే వారితో ఏ సినిమా కూడా హిట్ కాలేదు. క‌ల్కి విష‌యంలో అయినా స‌రే, రెండో పార్ట్ విడుద‌ల రోజున‌.. ఇదే స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను క‌దిలించే అవ‌కాశాలు త‌క్కువ‌! అందునా.. వంద‌ల కోట్ల ఓపెనింగ్స్ కావాలి, ప్యాన్ ఇండియా అంతా సినిమా చూడాలి అంటే.. అర్రీబుర్రీగా సీక్వెల్స్ అనేస్తే స‌రిపోదు. చెప్పాల్సిన క‌థ‌ను ఉన్న నిడివిలో చెప్ప‌లేక‌పోవ‌డం ద‌ర్శ‌కుడి ఫెయిల్యూరే త‌ప్ప స‌క్సెస్ కాదు!

వెబ్ సీరిస్ లు తీసుకోవ‌చ్చు!

వెబ్ సీరిస్ లు అంటే ఇప్పుడేమీ చిన్న చూపు కూడా లేదు! కాబ‌ట్టి ఈ పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు ఫీచ‌ర్ ఫిల్మ్ లు కాకుండా ఎంచ‌క్కా వెబ్ సీరిస్ లు తీసుకుంటే స‌రిపోదా! క‌ల్కి సినిమా క‌థ‌ను ఐదు సినిమాలుగానో ఏమో తీస్తార‌ట‌! అస‌లు మొద‌టి భాగ‌మే పెద్ద సీరియ‌ల్ అనిపించింది. దాదాపు మూడు గంట‌ల నిడివితో.. ఐదారు వెబ్ సీరిస్ ఎపిసోడ్లుగా డివైడ్ చేసుకోవ‌చ్చు.

కాబట్టి.. సీజ‌న్ 1, సీజ‌న్ 2 అంటూ.. వెబ్ సీరిస్ లుగా తీసుకుంటే.. దాని మార్కెట్ కూ లోటేమీ లేదు. థియేట‌ర్ల‌లో విజిల్స్ లేక‌పోవ‌చ్చు త‌ప్ప‌.. వెబ్ సీరిస్ కు ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్ మార్కెట్ ఉంది. కావాల‌ని థియేట‌ర్లో విడుద‌ల‌య్యే సినిమాలే చేయాల‌నే ప్ర‌తిష్ట‌కుపోవ‌డం అంటే వెబ్ సీరిస్ లు తీసుకోవ‌డం ఉత్త‌మం!

ఎక్క‌డ దెబ్బ‌తింటున్నారు?

ఏ సినిమా అయితే సీక్వెల్ మోజుతో వ‌స్తోందో.. అది నెరేష‌న్ లో తేడా కొడుతూ ఉంది. తాము చెప్పాల‌నుకున్న పాయింట్ల‌ను కొన్ని సీక్వెల్ కోసం అంటూ దాచేసుకోవ‌డం, ఎడిటింగ్ లో లేచిపోవాల్సిన ఎన్నో సీన్లు సీక్వెల్ కార‌ణంగా ఫైన‌ల్ క‌ట్ లో అలాగే వ‌స్తూ ఉండ‌టం తో థియేట‌ర్ల‌లో సీరియ‌ళ్ల‌ను చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతూ ఉంది.

క‌ల్కి సినిమా ఇలాంటి ఫీలింగ్ ను ఎన్నోసార్లు క‌లిగిస్తుంది. సీక్వెల్ మోజుల‌తో చాలా ఎక్కువ విష‌యాల‌ను చెప్పాల‌నే తాప‌త్ర‌యం రైటింగ్ లోనే క‌నిపిస్తుంది. ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ కు ఎలాంటి ప‌నిలేకుండా చేస్తున్నారు ద‌ర్శ‌కులు.

ఎడిట్ చేసుకుంటూ పోతే.. గంట వ్య‌వ‌ధి సినిమా క‌ట్ అయిపోతుంది. దీంతో చెప్పాల‌నుకున్న ఎంత పెద్ద క‌థ కూడా ఒక్క సినిమాకు ప‌రిమితం అవుతుంది. అయితే సీక్వెల్ కావాలి.. వంద‌ల కోట్ల వ‌సూళ్లు కావాలి, కాబ‌ట్టి.. ఎంత వీలైతే అంత లాగాల‌న్న‌ట్టుగా సినిమాలు త‌యార‌వుతున్నాయి. తొలి భాగం అప‌రిమిత‌మైన ఆస‌క్తిని క‌లిగించ‌డం అంటుంచి, అస‌లు ఈ సీరియ‌ల్ నెరేష‌న్ తో మొద‌ట‌కే మోసం వ‌స్తోంది.

ముందు అనౌన్స్ చేసేస్తే చాలు!

ఏడాది కింద‌ట స్కంద అనే క‌ళాఖండానికి క్లైమాక్స్ లో స్కంద 2 కు రెడీగా ఉండాల‌నే శుభం కార్డు వేశారు. క్లైమాక్స్ లో హీరోని ఉన్న ఫ‌లంగా డ‌బుల్ యాక్ష‌న్ చేసేసి సీక్వెల్ తో చావ‌గొట్ట‌బోతున్న‌ట్టుగా బోయ‌పాటి ఏదో ప్ర‌య‌త్నం చేశాడు. మ‌రి ఇప్పుడు స్కంద 2 తీసి ప్రేక్ష‌కులపై ప్ర‌తీకారం తీర్చుకోనున్నారా? అంటే కాద‌ట‌, బోయ‌పాటి నుంచి అఖండ సీక్వెల్ వ‌స్తుంద‌ట‌!

ఇక అదే స‌మ‌యంలో పెద‌కాపు పార్ట్ వ‌న్ అంటూ మ‌రో క‌ళాఖండం వ‌చ్చింది. ఆ సినిమా అయితే ఇంట‌ర్వెల్ వ‌చ్చే స‌రికే సినిమా అయిపోయి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ ను పుట్టించింది. మ‌రి పెద‌కాపు 2 ఎప్పుడు వ‌స్తుందో దాని రూప‌క‌ర్త‌ల‌కే తెలియాలి! అలాంటి హెచ్చుల‌కు పోయే బ‌దులు.. చెప్ప‌ద‌లుచుకున్న క‌థ‌ను ఒకే పార్ట్ లో చెప్పి ఉంటే.. అదో సినిమాగా చెప్పుకోవ‌డానికి అయినా ఉండేది!

అయితే.. ముందే అనౌన్స్ చేసేసి మార్కెటింగ్ జిమ్మిక్ చేసుకుంటూ ఉన్నారు. అయితే సీక్వెల్ సంగ‌తలా ఉంచి ఫ‌స్ట్ పార్ట్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డాన్ని మ‌రిచిపోతున్నారు ద‌ర్శ‌కులు. త‌మ మేధ‌స్సు మీద ఎక్కువ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడిని అస్స‌లు ఖాత‌రు చేయ‌డం లేదు.

దేవ‌ర కూడా ఒక పార్ట్ కాద‌ని మొద‌ట్లోనే క్లారిటీ ఇచ్చి, భ‌రించాల్సిందే అనే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. భార‌తీయుడు-2నే ఎక్కువ అనుకుంటే, దానికి మూడో పార్ట్ అంటూ శంక‌ర్ న‌స పెట్టాడు. ఎందుకు సీక్వెల్స్ మీద ఇంత మోజు? అనే ప్ర‌శ్న‌ను పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు కూడా వేసుకోక‌పోవ‌డం వెనుక కేవ‌లం మార్కెట్ లెక్క‌లే ఉన్నాయి కాబోలు.

సందీప్ రెడ్డి వంగ కూడా అనిమ‌ల్ పార్క్ అంటున్నాడు! మొద‌టి పార్టే మూడు గంట‌లు ప‌ట్టింది, అదో ప్ర‌యోగం లాగా చూశారు. క‌లెక్ష‌న్లూ వ‌చ్చాయి క‌దా, ఇంకేదో కొత్త క‌థ చెప్పాల‌నుకోకుండా.. ఒక అనిమ‌ల్ చాల‌ద‌న్న‌ట్టుగా అనిమ‌ల్ పార్క్ అంటున్నాడు.

అయితే సీక్వెల్స్ అంటే జ‌నాలు ఇప్పుడు విసుక్కొంటున్నారు. అంత‌గా సీక్వెల్ క‌థ‌లుంటే.. సినిమాల‌కు సీక్వెల్ గా వెబ్ సీరిస్ లు తీసుకోనూవ‌చ్చు! హాలీవుడ్ లో అలాంటి వెబ్ సీరిస్ లు కూడా వ‌స్తున్నాయి. ఇండియాలో కూడా వెబ్ సీరిస్ ల‌కు ఆద‌ర‌ణ చాలా పెరిగింది. చాలా విష‌యాల‌ను చెప్పాల‌నుకుంటూ వెబ్ సీరిస్ ల‌ను తీస్తున్న ద‌ర్శ‌కులున్నారు. వాటిని క‌న్నార్ప‌కుండా చూస్తున్న ప్రేక్ష‌కులూ ఉన్నారు. కాబ‌ట్టి.. ఈ సీక్వెల్స్ సోది త‌గ్గించి ప్రేక్ష‌కుల‌ను కాస్త క‌రుణించ‌గ‌ల‌రు టాలీవుడ్ ద‌ర్శ‌కులు!

జీవ‌న్ రెడ్డి. బి

26 Replies to “మ‌బ్బుల్లో సీక్వెల్స్.. మొద‌టికే మోసం!”

  1. కల్కి సినిమా సీరియల్ లాగా అనిపించిందా…వీడిని ఎవరికైనా చూపించండిరా ఆలా వదిలేయకండి

  2. వైసిపి 2.0 కూడా ఉండదు, ఫస్ట్ మూవీ ఉట్టర్ ఫ్లాప్ ఒక్కసారిగా 151 నుంచి 11, ఇంకా రెండో పార్ట్ గురించి ఆలోచించలేరు

  3. అన్నా రెడ్డన్నా, జిమ్మిక్కు కాదన్నా గిమ్మిక్ . నా బతుకు గత రెండు సంవత్సరాలుగా అయిదో తరగతి ఇంగ్లిష్ పాఠాలు చెప్పడం అయ్యిపోయింది ఈ వెబ్సైట్ లో. ఇంతవరకు ఒక్కడికి కూడా బుర్ర వెలగలేదు

  4. ఇంతకీ ఈ ఉపోద్గాతం అంతా దేవర 2 కోసమా? దేవర బాలేదా? అప్పుడే 240 కోట్లు గ్రాస్ అంటున్నారు.

    హిట్ సిరీస్, టిల్లు సిరీస్ బాగా ఆడాయి కదా. స్టోరీ లో బలం ఉండాలి.

  5. శంకర్ దాదా, ఎన్టీఆర్ కథానాయకుడు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు సీక్వెల్లు తీసి జనం మీదికి వదిలారు. వాటిని ప్రేక్షకులు ఫ్లాప్ చేసి పడేశారు.

    స్కంద, జిన్నా, భారతీయుడు 2 లాంటి కళాఖండాలకే సీక్వెల్ ఉంటుందని చివర్లో భయపెట్టారు. అది ఆ నోటా ఈ నోటా వ్యాపించి మొదటి సినిమానే నడవకుండా చేసింది, ఎందుకంటే ఈ సినిమా హిట్టయితే దాని సీక్వెల్ కూడా వస్తుందనే భయం వల్ల కాబోలు.

    పొరపాటున శివయ్య సినిమా హిట్టయితే జిన్నా సీక్వెల్ ఖాయం, అందుకే ప్రేక్షకులు శివయ్య విడుదలకు ముందే జాగ్రత్త పడాలి…

  6. బాబూ! వీరంతా పైకి చెప్పుకొనే sequels తీస్తున్నారు. కానీ పైకి కనబడకున్నా sequel కి scope ఉంచొకొని hero characters design చేసుకొనే దర్శకేంద్రుడు మరొకడున్నాడు. వంగా సందీప్. ప్రతి చిత్రంలో హీరో ఆవారాగాడిలా, చిల్లర వెధవలా, సోంబేరిల్, పోరంబోకులా ఉన్నా heroine చొంగ కార్చుకుంటూ వాడి వెంట తిరుగుతుంది. చివరాఖరికి మాత్రం ఆ హీరోయిన్ pregnant అని ఒరకటించి cinemax ముగిస్తాడు. అంటే ఒకవేళ తరువాత పెద్ద heroes తో తీసే తన cinemax లు వికటించి, జనాలకు విరక్తి కలిగిస్తే ఆ పుట్టబోయే త్రాష్టులని పార్ట్ 2 క్రింద దించుతారు.

  7. బాబూ! వీరంతా పైకి చెప్పుకొనే sequels తీస్తున్నారు. కానీ పైకి కనబడకున్నా sequel కి scope ఉంచొకొని hero characters designn చేసుకొనే దర్శకేంద్రుడు మరొకడున్నాడు. వంగా సందీప్. ప్రతి చిత్రంలో హీరో ఆవారాగాడిలా, చిల్లర వెధవలా, సోంబేరిల్, పోరంబోకులా ఉన్నా heroine చొంxగ కార్చుxకుంటూ వాడి వెంట తిరుగుతుంది. చివరాఖరికి మాత్రం ఆ హీరోయిన్ pregnantt అని ప్రకటించి cinemax ముగిస్తాడు. అంటే ఒకవేళ తరువాత పెద్ద heroes తో తీసే తన cinemax లు వికటించి, జనాలకు విరక్తి కలిగిస్తే ఆ పుట్టబోయే త్రాష్టులనిx పాxర్ట్ 2 క్రింద దించుతారు.

  8. బాబూ! వీరంతా పైకి చెప్పుకొనే sequels తీస్తున్నారు. కానీ పైకి కనబడకున్నా sequel కి scope ఉంచొకొని hero characters designn చేసుకొనే దర్శకేంద్రుడు మరొకడున్నాడు. వంగా సందీప్. ప్రతి చిత్రంలో హీరో ఆవారాగాడిలా, చిల్లర వెధవలా, సోంబేరిల్, పోరంబోకులా ఉన్నా heroine చొంxగ కార్చుxకుంటూ వాడి వెంట తిరుగుతుంది. చివరాఖరికి మాత్రం ఆ హీరోయిన్ pregnantt అని ప్రకటించి cinemax ముగిస్తాడు. అంటే ఒకవేళ తరువాత పెద్ద heroes తో తీసే తన cinemax లు వికటించి, జనాలకు విరక్తి కలిగిస్తే ఆ పుట్టబోయే త్రాష్టులనిx పాxర్ట్ 2 క్రింద దించుతారు.

  9. బాబూ! వీరంతా పైకి చెప్పుకొనే sequels తీస్తున్నారు. కానీ పైకి కనబడకున్నా sequell కి scoppe ఉంచొకొని herro characterrs designn చేసుకొనే దర్శకేంద్రుడు మరొకడున్నాడు. వంxగా సందీప్. ప్రతి చిత్రంలో హీరో ఆవారాగాడిలా, చిల్లర వెxధవలా, సోంబేరిల్, పోరంxబోకులా ఉన్నా heroine చొంxగ కార్చుxకుంటూ వాడి వెంట తిరుగుతుంది. చివరాఖరికి మాత్రం ఆ హీరోయిన్ pregnantt అని ప్రకటించి cinemax ముగిస్తాడు. అంటే ఒకవేళ తరువాత పెద్ద heroes తో తీసే తన cinemax లు వికటించి, జనాలకు విరక్తి కలిగిస్తే ఆ పుట్టబోయే త్రాష్టులనిx పాxర్ట్ 2 క్రింద దించుతారు.

  10. బాబూ! వీరంతా పైకి చెప్పుకొనే sequels తీస్తున్నారు. కానీ పైకి కనబడకున్నా sequell కి scoppe ఉంచొకొని herro characterrs designn చేసుకొనే దర్శకేంద్రుడు మరొకడున్నాడు. వంxగా సందీప్. ప్రతి చిత్రంలో హీరో ఆవారాగాడిలా, చిల్లర వెxధవలా, సోంబేరిల్, పోరంxబోకులా ఉన్నా heroine చొంxగ కార్చుxకుంటూ వాడి వెంట తిరుగుతుంది.

  11. చివరాఖరికి మాత్రం ఆ హీరోయిన్ pregnantt అని ప్రకటించి cinemax ముగిస్తాడు. అంటే ఒకవేళ తరువాత పెద్ద heroes తో తీసే తన cinemax లు వికటించి, జనాలకు విరక్తి కలిగిస్తే ఆ పుట్టబోయే త్రాష్టులనిx పాxర్ట్ 2 క్రింద దించుతారు.

  12. బాబూ! వీరంతా పైకి చెప్పుకొనే sequelss తీస్తున్నారు. కానీ పైకి కనబడకున్నా sequell కి scoppe ఉంచొకొని herro characterrs designn చేసుకొనే దర్శxకేంద్రుడు మరొకడున్నాడు. వంxగా సంxదీప్. ప్రతి చిత్రంలో హీxరో ఆవారాగాడిలా, చిల్లర వెxధవలా, సోంబేరిల్, పోరంxబోకులా ఉన్నా heroine చొంxగ కార్చుxకుంటూ వాడి వెంట తిరుగుతుంది. చివరాఖరికి మాత్రం ఆ హీరోయిన్ pregnantt అని ప్రకటించి cinemax ముగిస్తాడు. అంటే ఒకవేళ తరువాత పెద్ద heroes తో తీసే తన cinemax లు వికటించి, జనాలకు విరక్తి కలిగిస్తే ఆ పుట్టబోయే త్రాష్టులనిx పాxర్ట్ 2 క్రింద దించుతారు.

Comments are closed.